న్యూఢల్లీి, అక్టోబర్ 18 (ఆంధ్రపత్రిక): 2002 నాటి గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటనకు సంబం ధించిన కేసులో దోషులు ఇటీవల జైలు నుంచి విడుదల కావడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.ఈ కేసులో దోషులకు రెమిషన్ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖల య్యాయి. తాజాగా వారి విడుదలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమర్థించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను ఓ జాతీయ మీడియా సంస్థ ఈ కేసు గురించి ప్రశ్నించింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘అంతా చట్ట ప్రకారమే జరిగింది కాబట్టి ఇందులో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు. కొంతకాలం జైలులో శిక్ష అనుభవించిన ఖైదీల విడుదల కోసం నిబంధనలున్నాయి. చట్ట ప్రకారమే అది జరుగుతుంది’ అని వెల్లడిరచారు.ఇదిలా ఉంటే..ఈ పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలో వాటిపై స్పందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దానిలో భాగంగానే సోమవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించామని, 14 ఏళ్లకు పైగా జైల్లో గడిపినందునే వారిని విడుదల చేశామని అందులో పేర్కొంది. ఈ ప్రభుత్వ అఫిడవిట్‌ను మంగళవారం పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై స్పందన దాఖలు చేయడానికి పిటిషనర్లకు కొంత గడువు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!