బిగ్ బ్రేకింగ్: ఏపీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఏపీ (AP)పై ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో లాగా ఏపీ మారిందని ప్రధాని అన్నారు. శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
![బిగ్ బ్రేకింగ్: ఏపీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు](https://media.andhrajyothy.com/media/2023/20230317/modi_4a15100482_V_jpg--799x414-4g.webp)
ఢిల్లీ: ఏపీ (AP)పై ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో లాగా ఏపీ మారిందని ప్రధాని అన్నారు. శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ (TDP) ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (MP Kanakamedala Ravindrakumar)తో తన అభిప్రాయాలను ప్రధాని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో పాటు ఎంపీ కనకమేడల ప్రధాని మోదీని కలిశారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయని మోదీ ఆరా తీశారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను కనకమేడల ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ గురించి అన్ని విషయాలు తనకు తెలుసని మోదీ అన్నారు. అన్ని విషయాల్లో ఏపీ పంజాబ్‌లా తయారైందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఆర్ధిక, శాంతి భద్రతల పరిస్థితులు తన దృష్టిలో ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజలను మీరే కాపాడాలని ప్రధాని మోదీని ఎంపీ కనకమేడల కోరారు.కనకమేడల విజ్ణప్తికి సానుకూలంగా ప్రధాని మోదీ స్పందించారు. గతంలో చంద్రబాబు కూడా ఈ విషయం తన దృష్టికి తీసుకువచ్చినట్టుగా మోదీ గుర్తుచేశారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులు పట్ల విచారం వ్యక్తం చేసినట్లు టీడీపీ ఎంపీ కనకమేడల వెల్లడించారు.