కె.కోటపాడు,ఫిబ్రవరి15(ఆంధ్రపత్రిక):
పంచాయతీ కార్యదర్సుల యూనియన్ మండల నూతన కార్యవర్గానికి ఎన్నిక జరిగింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. మండల యూనియన్ గౌరవ అధ్యక్షులుగాఎన్.రామునాయుడు (చౌడువాడ),అధ్యక్షులుగా కె.భీమరాజు(ఎ.భీమవరం), ప్రధాన కార్యదర్సిగా వి.ప్రసాద్(కె.కోటపాడు), ఉపాధ్యక్షురాలుగా పి.భాగ్యశ్రీ (లంకవానిపాలెం), సంయుక్త కార్యదర్శిగా వై.అనూరాధ (కింతాడ), కోశాధికారిణిగా జి.ప్రవీణ (సూదివలస), కన్వీనరుగా పి.రమేష్ (గవరపాలెం) ఎన్నికయ్యారు. ఎన్నికల్లో మండలంలోని పంచాయతీ కార్యదర్సులు పాల్గొన్నారు. యూనియన్ నూతన ప్రతినిధులను వారు అభినందించారు.