అమృత్‌సర్‌లో ఉగ్రవాదులను అరెస్టు చేశారు. కేంద్ర ఏజెన్సీ సహకారంతో చేపట్టిన ఆపరేషన్‌లో పోలీసులు ఈ ముష్కరులను బంధించారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. రెండు ఐఈడీలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు మ్యాగజైన్లతో కూడిన పిస్టల్, 24 కాట్రిడ్జ్‌లు, టైమర్ స్విచ్, 8 డిటోనేటర్లు, నాలుగు బ్యాటరీల వంటి ఆధునిక ఆయుధాలను ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఓ వైపు క్రికెట్ ప్రియులు భారత్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది నరేంద్ర మోడీ స్టేడియాన్ని చేరుకుని సందడి మొదలు పెట్టేశారు కూడా.. అయితే మరోవైపు పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు పంజాబ్ పోలీసులు లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ ఉగ్రవాదులు దేశాన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్ర పన్నారు. అమృత్‌సర్‌లో ఉగ్రవాదులను అరెస్టు చేశారు. కేంద్ర ఏజెన్సీ సహకారంతో చేపట్టిన ఆపరేషన్‌లో పోలీసులు ఈ ముష్కరులను బంధించారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
రెండు ఐఈడీలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు మ్యాగజైన్లతో కూడిన పిస్టల్, 24 కాట్రిడ్జ్‌లు, టైమర్ స్విచ్, 8 డిటోనేటర్లు, నాలుగు బ్యాటరీల వంటి ఆధునిక ఆయుధాలను ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అమృత్సర్, కేంద్ర ఏజెన్సీతో కలిసి ఇంటెలిజెన్స్ చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా ఎల్ఇటి మాడ్యూల్‌ను ఛేదించిందని డీజీపీ చెప్పారు. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ నివాసితులైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ఉగ్రవాద మాడ్యూల్‌ను లష్కరే తోయిబా క్రియాశీల సభ్యుడు ఫిర్దౌస్ అహ్మద్ భట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
లష్కర్ ఉగ్రవాద మాడ్యూల్ ఛేదన
ఇదే విషయంపై పంజాబ్ పోలీసు చీఫ్ పిటిఐతో మాట్లాడుతూ.. సెంట్రల్ ఏజెన్సీ సహకారంతో పంజాబ్ పోలీస్-అమృత్సర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ సెల్ ఈ ఆపరేషన్ నిర్వహించిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ తెలిపారు. ” రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్-అమృత్సర్, కేంద్ర ఏజెన్సీతో సంయుక్త ఆపరేషన్‌లో, ఎల్ఇటి మాడ్యూల్‌ను ఛేదించింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది” అని తెలిపారు. ఉగ్రవాద మాడ్యూల్‌ను లష్కరే తోయిబా క్రియాశీల సభ్యుడు ఫిర్దౌస్ అహ్మద్ భట్ నిర్వహిస్తున్నారని.. ఈ అరెస్టుతో “పంజాబ్‌లో శాంతికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్న టెర్రర్ మాడ్యూల్‌కు పెద్ద దెబ్బ తగిలిందని డిజిపి వివరించారు.
ఇద్దరు ఖలిస్తాన్ ఉగ్రవాదులను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
అంతకుముందు పంజాబ్‌లోని మోగాలో కాంగ్రెస్ నాయకుడు, సర్పంచ్‌ను హత్య చేసిన కేసులో కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లా ఇద్దరు సహచరులను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అర్ష్ డల్లా హత్యకు బాధ్యత వహించాడు. విచారణ చేసిన అనంతరం ఈ ఇద్దరిని అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇద్దరూ పట్టుబడకుండా తప్పించుకుంటున్నారు.