ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: ఎన్‌వీ కిరణ్ కుమార్
సమర్పణ: మారుతి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: జై శివసాయి వర్ధన్
ఫలితంతో సంబంధం లేకుండా ఈ మధ్య వరస లు చేస్తూనే ఉన్నాడు రాజ్ తరుణ్. తాజాగా ఈయన నుంచి మరో వచ్చింది. ఈ సారి మారుతి లాంటి క్రేజీ డైరెక్టర్ తోడుగా వచ్చిన భలే ఉన్నాడే. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది..? ఆడియన్స్‌ను మెప్పించిందా..? రాజ్ తరుణ్ ప్లాపులకు బ్రేక్ వేసింది అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
గౌరీ (అభిరామి) ఓ బ్యాంకు ఉద్యోగి. ఆమె కొడుకు రాధ (రాజ్ తరుణ్) సారీ డ్రాపర్. పెళ్లిళ్ళు, ఫంక్షన్స్‌కు అమ్మాయిలకు చీర కట్టడం ఎలాగో నేర్పిస్తుంటాడు. సిటీలో ఆయనొక్కడే ఆ జాబ్ చేస్తుండటంతో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అలా అమ్మాయిల దగ్గరికి వెళ్లినపుడు కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిలు రాధను తమ అందంతో పడేయాలని చూస్తుంటారు కానీ ఆయన మాత్రం అస్సలు దగ్గరికి కూడా వెళ్లడు. ఈ క్రమంలోనే కృష్ణ (మనీషా కంద్కూర్) అనే అమ్మాయితో రాధకు పరిచయం అవుతుంది. చిన్నపాటి గొడవతో మొదలైన ప్రయాణం ప్రేమలో పడుతుంది. అయితే ఎప్పుడూ అమ్మాయిల మధ్యే ఉండే రాధ.. అసలు వాళ్ల వైపు కూడా ఎందుకు చూడడు..? అంత దగ్గరగా వాళ్ళతో మూవ్ అవుతున్నా కూడా ఎందుకు సైలెంట్‌గా ఉంటాడు..? పైగా తనతో ప్రేమలో ఉన్నపుడు కూడా ఎందుకు ముట్టుకోవడం లేదు అంటూ రాధాపై కృష్ణలో అనుమానాలు మొదలవుతాయి. ఇది చాలా దూరం వెళ్తుంది కూడా. అసలు అమ్మాయిలకు రాధ ఎందుకు దూరంగా ఉంటున్నాడు..? అతని గతం ఏమిటి..? చివరకు ఏమైంది అనేది .
కథనం:
ఫ్లాపుల్లో ఉన్నపుడు ఒక్కోసారి మంచి పడినా పట్టించుకోరు. రాజ్ తరుణ్ పరిస్థితి అలాగే ఉందిప్పుడు. అలాగని భలే ఉన్నాడే అదిరిపోయింది అనట్లేదు కానీ రీసెంట్ లతో పోలిస్తే డీసెంట్. మారుతి టీం ప్రాడక్ట్ కాబట్టే ఈ కు కొద్దోగొప్పో క్రేజ్ వచ్చిందనేది వాస్తవం. ఫస్టాఫ్ చూస్తుంటే.. అదేంటి మళ్లీ మారుతి బస్టాప్, ఈ రోజుల్లో కంటెంట్ వైపు వెళ్తున్నాడా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే అక్కడక్కడా వచ్చే సీన్స్ వింటేజ్ మారుతిని గుర్తు చేస్తాయి కాబట్టి. దర్శకుడు శివసాయి వర్ధన్ తీసుకున్న లైన్ అలాంటిది కాబట్టి.. అక్కడక్కడా కథకు తగ్గట్లు కొన్నిసార్లు ఓ మోస్తరు లైన్ దాటక తప్పలేదు. బండి కొన్నపుడు టెస్ట్ డ్రైవ్ చేసినట్లే.. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్ కాస్త డోస్ బోల్డ్‌గానే అనిపిస్తుంది. దాన్ని చాలా వరకు డీసెంట్‌గానే డీల్ చేసాడు దర్శకుడు. ఫస్టాఫ్ కొన్ని సీన్స్ బోల్డ్‌గానే అనిపిస్తాయి.. కానీ సెకండాఫ్ మాత్రం ఎమోషనల్‌గా వెళ్లాడు దర్శకుడు. సింగీతం శ్రీనివాసరావు గారి ఎపిసోడ్, అభిరామి ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి.. క్లైమాక్స్‌లో వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగున్నాయి. ముక్కలు ముక్కలుగా పర్లేదనిపిస్తుంది కానీ కలిపి చూస్తే మాత్రం భలే ఉన్నాడే అనిపించదు. ముఖ్యంగా హీరో ఎందుకలా ఉన్నాడు అనే దానికి చివర్లో చిన్న ఫ్లాష్ బ్యాక్‌తో కన్విన్సింగ్‌గానే చెప్పాడు కానీ ముందు రాసుకున్న సీన్స్ మాత్రం చాలా తేడాగా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కామెడీ కోసం కథను కంగాళీ చేసారనిపిస్తుంది. ఫ్యామిలీతో కూర్చుని ఈ చూస్తానని చెప్పాడు దర్శకుడు.. కానీ కొన్ని సీన్స్ మాత్రం కాస్త లైన్ దాటినట్లే అనిపిస్తుంది.
నటీనటులు:
రాజ్ తరుణ్ బాగున్నాడు.. రాముడు మంచి బాలుడు పాత్రలో బాగా నటించాడు కూడా. ఆయన మంచోడు అని చెప్పడానికే ఈ తీసారేమో అనిపించేంత మంచిగా నటించాడు. కొత్తమ్మాయి మనీషా కంద్కూర్ కూడా బాగానే నటించింది.. అలాగే గ్లామర్ షో కూడా. అమ్మగా నటించిన అభిరామి చాలా బాగుంది. ఆమె నటన కూడా కు ప్లస్. విటివి గణేష్ కామెడీ అదిరిపోయింది. హైపర్ ఆది జస్ట్ ఓకే.. చివర్లో వచ్చే సుదర్శన్ కూడా. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆకట్టుకుంటారు. మిగిలిన వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
భలే ఉన్నాడే కు శేఖర్ చంద్ర సంగీతం ఓకే.. పాటలు పర్లేదు. టోగ్రఫీ బాగుంది. అలాగే ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉండుంటే బాగుండేది. ముఖ్యంగా డబుల్ మీనింగ్ సీన్స్ కొన్ని కట్ చేయాల్సింది. అలాంటివి కుటుంబ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే సెకండాఫ్‌లో చాలా వరకు ఫ్యామిలీ సీన్స్ బాగా పడ్డాయి.. వాటిపై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ట్రిమ్ చేసుంటే బాగుండేది. కానీ దర్శకుడు శివసాయి వర్ధన్ నిర్ణయం కాబట్టి ఎడిటర్‌ను తప్పుబట్టలేం. దర్శకుడి రైటింగ్ బాగుంది.. స్క్రీన్ ప్లే ఇంకాస్త ఫాస్టుగా ఉండాల్సింది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. ముఖ్యంగా అమ్మ ఎపిసోడ్ అయితే అద్భుతంగా ఉంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా భలే ఉన్నాడే.. అక్కడక్కడా అలా అనిపిస్తాడు కానీ పూర్తిగా మాత్రం కాదు..