భగవంత్ కేసరి రిలీజ్ డేట్‌పై కన్ఫ్యూజన్ మొదలైందా..? బాలయ్య పొలిటికల్ బిజీ సినిమా విడుదల తేదీపై ప్రభావం చూపించబోతుందా..? దసరా సినిమాల్లో మిగిలిన రెండూ రేసులో దూసుకుపోతుంటే.. బాలయ్య సినిమా మాత్రమే షూటింగ్‌లో కాస్త వెనకడుగు వేస్తుందా..? మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భగవంత్ కేసరిని బాలయ్య ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? దసరాకు వస్తుందా రాదా..?
భగవంత్ కేసరి రిలీజ్ డేట్‌పై కన్ఫ్యూజన్ మొదలైందా..? బాలయ్య పొలిటికల్ బిజీ సినిమా విడుదల తేదీపై ప్రభావం చూపించబోతుందా..? దసరా సినిమాల్లో మిగిలిన రెండూ రేసులో దూసుకుపోతుంటే.. బాలయ్య సినిమా మాత్రమే షూటింగ్‌లో కాస్త వెనకడుగు వేస్తుందా..?
మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భగవంత్ కేసరిని బాలయ్య ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? దసరాకు వస్తుందా రాదా..? బాలయ్య ఒక్కసారి కమిటైతే ఎవ్వరి మాటా వినరు. అనుకున్న రిలీజ్ డేట్ కంటే నెల రోజుల ముందుగానే సినిమాను పూర్తి చేస్తారు. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకెళ్తారు నటసింహం.
భగవంత్ కేసరి విషయంలోను ఇదే ప్లానింగ్‌లో ఉన్నారు బాలయ్య. అయితే అనుకోకుండా ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులతో ఉన్నపలంగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఇన్ని రోజులు బ్రేక్స్ లేకుండా భగవంత్ కేసరి పూర్తి చేసారు అనిల్ రావిపూడి. దాంతో దసరాకు రాబోయే మిగిలిన సినిమాలపై డౌట్స్ ఉన్నాయేమో కానీ బాలయ్య మాత్రం ఆన్ టైమ్ అని ఫిక్సైపోయారు ఫ్యాన్స్.
అక్టోబర్ 19న రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్న టీంకి చంద్రబాబు అరెస్ట్ ఊహించని బ్రేక్ వేసింది. బావను జైలు నుంచి బయటకు తీసుకువచ్చే వరకు బాలయ్య సినిమాపై ఫోకస్ చేసేలా కనిపించడం లేదు.చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు నుంచి పొలిటికల్‌గా బిజీ అయ్యారు బాలయ్య. ఈ ఎఫెక్ట్ భగవంత్ కేసరి రిలీజ్ డేట్‌పై పడుతుందేమో అనే కంగారు ఫ్యాన్స్‌లో కనిపిస్తుంది.
కానీ ఆ భయం అక్కర్లేదు.. కేవలం 6 రోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంటున్నారు మేకర్స్. ప్రస్తుతం బాలయ్య లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు అనిల్. కానీ షూట్ పూర్తి కావాలంటే మాత్రం బాలయ్య రావాల్సిందే. దసరాకు రానున్న లియో షూటింగ్ నెల రోజుల కిందే పూర్తైంది. తాజాగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ కూడా పూర్తైంది.
ఎటొచ్చి బాలయ్య పొలిటికల్ బిజీపై భగవంత్ కేసరి ఫ్యూచర్ ఆధారపడి ఉంది. అయితే ఎంత బిజీగా ఉన్నా.. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచిస్తున్నారు నటసింహం. అదే జరిగితే దసరా వార్ ఎప్పట్లాగే ఉండబోతుంది..! చూడాలిక ఏం జరగబోతుందో..?