మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ అద్భుతమైన డ్రింక్‌లో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. కానీ, ఒక లిమిట్ వరకు తాగడం ఒకే. కానీ మోతాదుకు మించితే ఆరోగ్యానికి ముప్పే. ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ..
మన దేశంలో కాఫీ ప్రియులకు కొదవేలేదు. అది ఇంట్లో చేసిన ఫిల్టర్ కాఫీ అయినా, దుకాణంలో కొన్న కాఫీ అయిన సరే.. తాగిన వెంటనే శరీరంలో అద్భుతమైన తాజాదనం వస్తుంది. మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ అద్భుతమైన డ్రింక్‌లో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. కానీ, ఒక లిమిట్ వరకు కాఫీ తాగడం ఒకే. కానీ మోతాదుకు మించితే ఆరోగ్యానికి ముప్పే. కాఫీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే హాని కలుగుతుంది. ఎక్కువ కాఫీ గుండెకు మంచిది కాదంటున్నారు. ఎవరు కాఫీని ఎందుకు ఎక్కువగా తాగకూడదో తెలుసుకుందాం..
1. అధిక రక్తపోటు: కాఫీలో అధిక మొత్తంలో కెఫీన్ ఉంటుంది. దీని కారణంగా ఇది త్వరగా రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది . మీకు గుండె సంబంధిత జబ్బులు, అధిక బిపి ఉన్నట్లయితే కాఫీని తగ్గించి తాగండం మంచిది.
2. నిద్ర లేకపోవడం: మనం కాఫీ తాగడం వల్ల రిఫ్రెష్‌గా ఉంటుంది. మగత, అలసట మాయమవుతాయి. దీనివల్ల చురుకుదనం పెరుగుతుంది, కానీ, కాఫీ ఎక్కువగా తాగితే కెఫీన్ వల్ల సరైన సమయానికి నిద్రపట్టదు. నిద్రపోయే విధానం పూర్తిగా మారిపోతుంద.ఇ
3. డిమెన్షియా వ్యాధి: రోజుకు 5 లేదా 6 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది రోగి అసాధారణంగా ప్రవర్తించే మానసిక అనారోగ్యం. ఇది అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వంటి వ్యాధులకు దారి తీస్తుంది.
4. జీర్ణక్రియ సమస్య: కాఫీ తాగడం వల్ల మన పొట్టపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇది గ్యాస్ట్రిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది ప్రేగు కార్యకలాపాలను పెంచుతుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది.