దిల్లీ,డిసెంబర్ 15 (ఆంధ్రపత్రిక): సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అవకాశం ఉన్న చోట అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా సీబీఎస్ఈ విద్యార్థులే లక్ష్యంగా మోసాలకు దిగారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేరిట ఓ నకిలీ వెబ్సైట్ తెరిచి కొత్త దందాకు తెరతీశారు. రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి రావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అప్రమత్తమైంది. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు ట్విటర్ వేదికగా ఫ్యాక్ట్‌చెక్ అలర్ట్ జారీ చేసింది.ఓ నకిలీ వెబ్సైట్లో అడ్మిట్‌కార్డు రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టాలని ఫేక్ లింక్ చూపిస్తోందంటూ పీఐబీ దృష్టికి వచ్చింది. దీంతో ఈ సైట్‌కు ఎలాంటి అనుమతీ లేదని పీఐబీ తెలిపింది. కేవలం షపంవ.స్త్రశీఙ.ఱఅ, షపంవ.అఱష.ఱఅ మాత్రమే సీబీఎస్ఈకి చెందిన అధికారిక వెబ్సైట్లు అని పేర్కొంది. పరీక్ష తేదీలు, డేటా షీట్లు, పరీక్షా ఫలితాలు మొదలైన సమాచారం కోసం అధికార వెబ్సైట్లను సంప్రదించాలని తెలిపింది. ఏదైనా సమాచారం తనిఖీ చేసేటప్పుడు అసలుదా? నకిలీదా? అనేది చెక్ చేసుకోవాలని సూచించింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!