– రుడా ఛైర్మన్ షర్మిలా రెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
రావులపాలెం,ఫిబ్రవరి 9(ఆంధ్రపత్రిక):విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డి, ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోరారు. గురువారం రావులపాలెం జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో పిఎంసి ఛైర్మన్ గొలుగూరి సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో కలసి షర్మిలారెడ్డి విద్యార్థులకు 250 ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకుని ఎక్కువ మంది విద్యార్థులు 10 కి 10 జిపిఏ సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం షర్మిలా రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ సాకా మణికుమారి, వైస్ ఎంపీపీ బొక్క ప్రసాద్, ఎంపీటీసీ దొండపాటి వీర్రాజు, గూటం తిమోతి ప్రకాశరావు, జక్కంపూడి సత్యవతి, కోట విజయకుమారి, వైసీపీ నాయకులు కర్రి వీర్రెడ్డి, జెడ్పీ బాలుర హైస్కూల్ పిఎంసి ఛైర్మన్ చిర్ల కనికిరెడ్డి, ఎంపీడీవో జి.రాజేంద్రప్రసాద్, ఎంఈఓ ఎం.హరిప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కె. సువర్ణకుమారి, ఎం. సుబ్బరాజు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.