ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నాం అంటూ ముందడుగులు వేస్తున్న డాక్టర్ బి ఎస్ కిరణ్ పాల్..!
తమ బెరాకా మిని
స్ట్రీస్ సంస్థ ద్వారా ఇటీవల ఐదు లక్షల చెక్కులు ఇంటి సామాగ్రి పంపిణీ..!
పేదవారికి, ఒంటరి మహిళలకు, ఆపన్నులకు, అభాగ్యులకు, చేయూతనిస్తున్న బెరాకా మినిస్ట్రీస్..!
మచిలీ పట్నం అక్టోబర్ 19 ఆంధ్ర పత్రిక.
ఎవరికి ఏ కష్టం వచ్చినా బెరాక మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బి .ఎస్ .కిరణ్ పాల్ తలుపు తట్టడం ఆలస్యం వెంటనే స్పందించి తన ఉదారతను మానవతను చాటుకొని వారి ఆపన్న హస్తం అందిస్తున్నారు.
చెరగని చిరునవ్వు, ప్రసన్న హృదయంతో కష్టాల్లో ఉన్నవారి కడగండ్లు తీర్చడానికి తమ సంస్థ ద్వారా కిరణ్ పాల్ ముందువరుసలో ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు.
రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లలో, రాత్రివేళ నిద్రించే నిరాశ్రయులకు స్వయంగా తానే దుప్పట్లు కొని వస్త్రాలు ఇవ్వడం కిరణ్ పాల్ నైజం.వృద్ధాశ్రమం లలో కూడా వీరు. సేవల్ని విస్తృత పరుస్తున్నారు. బస్ స్టేషన్లలో, ప్రజల దాహార్తి తీర్చడానికి చల్లని మంచి నీటి కూలర్లు ఏర్పాటు చేసి వితరణ చాటారు.
అలాగే తమ బెరాక వసతి గృహం ద్వారా ఎందరో పేద విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారి ఉన్నతికి అను నిత్యం పాటుపడుతున్నారు.
వీరు చేయూతను అందించడమే కాక, చేయూతనిచ్చే దాతలకి కూడా స్ఫూర్తిని అందిస్తున్నారు. నిజంగా ఇది కదా సేవంటే..!
పేద వర్గాల, అణగారిన వర్గాల, ఒంటరి కుటుంబాల వారికి బెరాకా మినిస్ట్రీస్ సంస్థ ఒక చల్లని గొడుగు లాగా నీడనిస్తోంది అని చెప్పవచ్చు. వీరు ఉమ్మడి జిల్లాలలో తమ సేవల్ని నిరంతరం విస్తృత పరుస్తూ ముందడుగులు వేస్తున్నారు. సాయం చేయడంలో పెద్ద మనసు చాటుతున్నారు. అగ్ని ప్రమాద బాధితుల, రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు అండగా నిలబడుతూ తమ బెరాకా మినిస్ట్రీస్ ద్వారా, పెద కుటుంబాల్లో భరోసా, ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నారు. కిరణ్ పాల్ చేస్తున్న సేవలు అధికారుల, అనధికారుల రాజకీయ నాయకుల ప్రముఖుల ప్రశంసలు పొందడం గమనార్హం.
ఇటీవల ఇళ్లు కోల్పోయిన బాధితులకు 5 లక్షల రూపాయల చెక్కులను, వారికి కావలసిన ఇంటి సామాగ్రిని అందించడం జరిగింది. ఇది కిరణ్ పాల్ ఉదారతకు నిదర్శనం అని చెప్పొచ్చు.
అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి తమ సంస్థ కార్యాలయంలో వారి పిల్లల విద్య, వైద్యానికి చెక్కులు అందించారు.
ఇటీవల 40 మంది మహిళలకు తమ బెరాకా వసతి గృహం నందు వారి స్వయం ఉపాధి నిమిత్తం కుట్టుమిషన్లు, రోటరీ వారితో కలిసి సంయుక్తంగా పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా బుధవారం కిరణ్ పాల్ మీడియా తో మాట్లాడుతూ ఈ సమాజంలో దయగల దాతలు విద్యకి, వైద్యానికి అండగా నిలబడితే అదే పేద ప్రజలకు కొండంత అండ అన్నారు. తమ సంస్థ ద్వారా చేతనైనంత సాయం చేయడం తన అదృష్టమన్నారు. ఆ దృక్కోణంలో తమ బెరాకా మినిస్ట్రీస్ సంస్థ ద్వారా సాయం అందించడమే లక్ష్యంగా అంకిత భావంతో పనిచేస్తున్నామని అన్నారు. సేవ, సంకల్ప బలం, ఆశయం, లక్ష్యం, అంకితభావంతో పని చేయడం వల్లే తమ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృత పరుస్తున్నామని అన్నారు. అనాధలు, అభాగ్యులకు వారు గమ్యం చేరడానికి తమ వసతి గృహంలో చేయూత అందించి వారి ఉన్నతికి పాటుపడడమే లక్ష్యంగా తాను, తన సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు. తమ వద్ద విద్య నేర్చుకునే విద్యార్థులకు త్యాగం, ప్రార్దన, క్షమ, ఆదరణ, కలిసి మెలసి ఉండడం, సోదర భావం , వ్యక్తిత్వ వికాసం, యోగా, ధ్యానం, నేర్పుతున్నామన్నారు.
మహిళలు స్వశక్తితో ఎదగాలని వారికి 40 కుట్టు మిషన్లు పంపిణీ చేశామన్నారు.
ప్రతి ఒక్కరూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళా లంటే అది విద్య ద్వారానే సాధ్యం అని అలాంటి విద్యను పేదవారికి, అందించాలన్నదే తమ సంస్థ ఆశయం, సంకల్పం అని కిరణ్ పాల్ అన్నారు.
ఇలాంటి ఉన్నత ఆశయాలు, వజ్ర సంకల్పం, నిరంతరం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, అలుపెరుగని శ్రామికుని లా నిరంతరం కృషి చేయడం ఒక్క కిరణ్ పాల్ కే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. తమ బెరాకా మినిస్ట్రీస్ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృత పరుస్తూ కిరణ్ పాల్ విద్యా వైద్యానికి అగ్ర తాంబూలం వేస్తారని పేదలు, అన్నార్తుల, అభాగ్యుల సేవలో మరింతగా తరిస్తారని ఆశిద్దాం..