మచిలీపట్నం డిసెంబర్ 2 ఆంధ్ర పత్రిక.
ఆపనులను, అనాధలను అక్కున చేర్చుకుంటూ మేమున్నాం అంటూ బెరాకా మినిస్ట్రీస్ సంస్థ ముందంజలో కొనసాగుతోంది. ఈ స్ఫూర్తితో తన సేవల్ని కొనసాగిస్తూ, కృష్ణ యూనివర్సిటీ లో నిర్వహిస్తున్న కృష్ణాతరంగ్ యువతరం మహోత్సవానికి బెరాకా మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బి.ఎస్ కిరణ్ పాల్ తమ సంస్థ తరఫున లక్ష రూపాయలు మహోత్సవానికి విరాళం ప్రకటించారు. యువతలో క్రీడా వికాసాన్ని పెంపొందించడానికి, మానసిక, శారీరక వికాసాలు అభివృద్ధి చేయడానికి బెరాకా మినిస్ట్రీస్ సంస్థ ద్వారా కిరణ్ పాల్ చూపిన ఔదార్యం, చొరవకు కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ జి జ్ఞానమని, కిరణ్ పాల్ ని అభినందించారు. బెరాకా మినిస్ట్రీస్ సంస్థ ద్వారా కిరణ్ పాల్ చేస్తున్న సేవలు అనన్య సామాన్యమని వైస్ ఛాన్స్లర్ కొనియాడారు.
విద్యార్థుల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాస సాధనకు, విద్యలోను, జీవన విధానంలోనూ, వారిలో సాంస్కృతిక వికాసం పెంపొందించడానికి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆటవిడుపుగా ఇలాంటి కార్యక్రమాలు వారికి ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. గత రెండు రోజులుగా కృష్ణాతరంగ్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోందని జ్ఞానమని అన్నారు.
ఈ సందర్భంగా బెరాకా మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బి ఎస్ కిరణ్ పాల్ మాట్లాడుతూ యువతలో, విద్యార్థుల్లో సామాజిక ,సాంస్కృతిక సోదర భావం, సమానత్వం అనే సేవా భావము నెలకొల్పడం తమ సంస్థ ప్రధాన ఉద్దేశ్యము అని తమ సంస్థ ద్వారా కృష్ణా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న యువ తరంగాలు కి ,లక్ష రూపాయలు చేయూతను అందించడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి యువతలో ప్రతిభా నైపుణ్యాలను మరింతగా వెలుగు లోకి తీసుకురావాలన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తమ సంస్థ ద్వారా చేపడతామన్నారు. ప్రతిభగల విద్యార్దులకు కూడా చేయూతని అందించడం జరుగుతోందని అన్నారు. విద్య ద్వారా ఉన్న స్థితి నుండి, ఉన్నత స్థితికి ఎదగ వచ్చని విద్యతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని కిరణ్ పాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ బ్రహ్మచారి, యూనివర్సిటీ సిబ్బంది, ప్రాజెక్టు డైరెక్టర్ నాగిశెట్టి డానియల్, పోర్టు డైరెక్టర్ మేకతోటి దయా సాగర్, తదితరులు పాల్గొన్నారు.