నవంబర్ 11 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్‌లో హీరోయిన్ గా క్లిక్ అయితే చాలు ఒక్క సినిమా హిట్ అయితే పది సినిమాల ఆఫర్లు ఒకేసారి వచ్చేస్తాయి. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బెంగుళూరు భామ కృతి శెట్టి. ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో కృతి శెట్టి చూపించిన అభినయం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. మొదటి సినిమాకే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న జాబితాలో కృతి శెట్టిని చేర్చింది. ఉప్పెన హిట్‌తో అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ వచ్చింది కృతి శెట్టి. ఉప్పెన తర్వాత నానితో శ్యామ్ సింగ రాయ్ సినిమా చేసిన కృతి శెట్టి ఆ మూవీతో కూడా హిట్ అందుకోగా నెక్ట్స్ వచ్చిన బంగార్రాజు కూడా సక్సెస్ అయ్యింది. హ్యాట్రిక్ హిట్స్‌తో కృతి శెట్టి రేంజ్ పెరగ్గా తర్వాత వచ్చిన 3 సినిమాలు ప్లాప్ అయ్యి అమ్మడికి షాక్ ఇచ్చాయి. బంగార్రాజు తర్వాత రామ్‌తో ది వారియర్ నితిన్ మాచర్ల నియోజకవర్గం సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి విూకు చెప్పాలి సినిమా చేసింది. ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. హ్యాట్రిక్ హిట్ హ్యాట్రిక్ ప్లాప్‌లతో కెరియర్ రిస్క్‌లో పడ్డ బేబమ్మ వచ్చిన ప్రతి ఛాన్స్ చేయకూడదు అని ఇప్పుడు జ్ఞానోదయమైంది. ఉప్పెన క్రేజ్‌తో వచ్చినా సినిమా ప్రతి ఒక్కటి సైన్ చేసుకుంటూ వెళ్తే ఇలానే జరుగుతుంది. అందుకే కృతి శెట్టి సినిమాలకు కొద్దిగా టైం తీసుకోవాలని అనుకుంటుంది. ప్రస్తుతం కృతి శెట్టి నాగ చైతన్యతో వెంకట్ ప్రభు మూవీలో జోడీ కడుతుంది. ఈ మూవీతో పాటుగా మళయాళంలో కూడా కొత్త మూవీ చేస్తుంది. ఇక విూదట కథల విషయంలో కాంప్రమైజ్ అవకుండా ఉండాలని అనుకుంటుంది కృతి శెట్టి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!