వైసిపి ఏజెంట్లకు సజ్జల హెచ్చరికలు
9న యధావిధిగా జగన్ ప్రమాణం ఉంటుందని వెల్లడి
అమరావతి,మే29():ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కౌంటింగ్ ఏజెంట్లకు వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకషృష్ణారెడ్డి సూచించారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ఏజెంట్ల సమావేశానికి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం.. జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే, ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇక, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని.. టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. వారంరోజుల తర్వాత రాష్టాన్రికి టీడీపీ పీడ విరగడ వుతుందని పేర్కొన్నారు. అయితే, బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఆయనకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఈసీ చంద్రబాబు వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిందంటూ సజ్జల మండిపడ్డారు. ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!