మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు అనేది బ్యాంకులు తమ కార్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ మొదలైన వాటి వడ్డీ రేటును నిర్ణయించే స్థిర రుణ రేటు. బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించలేని కనిష్ట రేటు ఇది. ఎంసీఎల్‌ఆర్ రేట్లలో బ్యాంక్ ఏదైనా మార్పు చేస్తే, అది కస్టమర్ల రుణ వడ్డీ రేటు, ఈఎంఐపై కూడా ప్రభావం చూపుతుంది. అధిక ఎంసీఎల్‌ఆర్ కారణంగా వినియోగదారులపై ఈఎంఐ భారం పెరుగుతుంది…
మరో రెండు బ్యాంకులు ఖాతాదారులకు పెద్ద షాకిచ్చాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో రుణ వడ్డీ రేట్లను పెంచారు. రెండు ప్రధాన బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR) పెంచాయి. రెండు బ్యాంకులు తమ ఎంసీఎల్‌ఆర్‌ని 5 బేసిస్ పాయింట్లు పెంచాయి. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2023 నుండి అంటే శుక్రవారం నుండి అమలులోకి వచ్చాయి.
ఈ పెంపు తర్వాత, గతంలో లేదా భవిష్యత్తులో కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేసిన బ్యాంక్ కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. రుణ వడ్డీ రేట్లపై ఎంసీఎల్‌ఆర్ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకోండి.
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త రేట్ల గురించి తెలుసుకోండి:
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచి కోట్లాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఈ పెరుగుదల తర్వాత బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.40 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్ 8.45 శాతం, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.50 శాతానికి, 6 నెలల ఎంసీఎల్‌ఆర్ 8.85 శాతానికి, ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త రేట్ల గురించి తెలుసుకోండి:
రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెరుగుదల తర్వాత బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 8.10 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్ 8.20 శాతం నుంచి 8.25 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.30 శాతం నుంచి 8.35 శాతానికి పెరిగింది.
MCLR అంటే ఏమిటి?
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు అనేది బ్యాంకులు తమ కార్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ మొదలైన వాటి వడ్డీ రేటును నిర్ణయించే స్థిర రుణ రేటు. బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించలేని కనిష్ట రేటు ఇది. ఎంసీఎల్‌ఆర్ రేట్లలో బ్యాంక్ ఏదైనా మార్పు చేస్తే, అది కస్టమర్ల రుణ వడ్డీ రేటు, ఈఎంఐపై కూడా ప్రభావం చూపుతుంది. అధిక ఎంసీఎల్‌ఆర్ కారణంగా వినియోగదారులపై ఈఎంఐ భారం పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో బ్యాంకులకు వివిధ రకాల రుణాలపై వడ్డీను పెంచేస్తున్నాయి.దీంతో ఈఎంఐల భారం పెరిగిపోతోంది.కానీ తప్పనిసరి రుణం కావాలనుకునే వారికి ఎలాంటి రేట్లు పెరిగినా తీసుకుంటూనే ఉన్నారు.