Bank Holidays March 2024: దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ ఉంది. ప్రతిరోజు లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కరోజు బ్యాంకు బంద్ ఉన్న సరే ఆ రోజు కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోతాయి.
ముఖ్యంగా బిజినెస్వారు ప్రతిరోజు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే బ్యాంకు హాలిడేస్ గురించి తెలుసుకోవడం అవసరం. దీనివల్ల ఏవైనా బ్యాంకుకి సంబంధించిన పనులుంటే ముందుగానే చేసుకోవచ్చు. ఆర్బీఐ ప్రతి ఏడాది బ్యాంకులకు సెలవుల లిస్టు రిలీజ్ చేస్తుంది. దానిని బట్టి మార్చిలో 14 రోజులు సెలవులు వస్తున్నాయి. అవి ఏ రోజులో ఈ రోజు తెలుసుకుందాం.
* మార్చి 1న చప్చర్ కుట్ వేడుక సందర్భంగా మిజోరాంలో బ్యాంకులు పనిచేయవు.
* ఇక మార్చి 3న ఆదివారం సెలవు ఉంటుంది.
* మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
* మార్చి 9న రెండో శనివారం సందర్భంగా అన్ని చోట్ల బ్యాంకులు బంద్.
* ఇక మార్చి 10న ఆదివారం దేశంలోని అన్ని చోట్ల బ్యాంకులు సెలవు.
* మార్చిన 17న ఆదివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
* ఇక మార్చి 22న బీహార్ దివస్ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు దినం.
* మార్చిన 23న నాలుగో శనివారం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
* ఇక మార్చి 24న ఆదివారం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
* మార్చి 25న హోలీ సందర్భంగా దేశంలోని చాలా చోట్ల బ్యాంకులు పనిచేయవు.
* ఇక మార్చి 26న హోలీ సందర్భంగా ఒడిస్సా, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
* ఇక బిహార్‌లో హోలీ వేడుకను పురస్కరించుకొని మార్చి 27న బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
* మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
* మార్చి 31న ఆదివారం అన్ని చోట్ల బ్యాంకులు పనిచేయవు.
ఇన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్ లైన్ సర్వీసులు యధావిధిగా పని చేస్తాయి. బ్యాంకులకు చెందిన ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్స్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు యూపీఐ ట్రాన్జాక్షన్స్ ఉండేనే ఉన్నాయి. అయితే బ్యాంకులకు వెళ్లి కచ్చితంగా చేసే కొన్ని పనులు ఉంటాయి. వాటి కోసం మాత్రం ముందుగానే బ్యాంకులకు వెళ్లక తప్పదు.