మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి తన నలుగురు గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. రాష్ట్ర డీజీపీకి లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూములను కబ్జా చేస్తున్న ముఠాలో తన అనుచరులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని అరెస్ట్ చేయాలంటూన పోలీసులకు సూచించినా పట్టించుకోవడం లేదన్న బాలినేని తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇందుకు నిరసనగా తన నలుగురు గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి తన నలుగురు గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. రాష్ట్ర డీజీపీకి లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూములను కబ్జా చేస్తున్న ముఠాలో తన అనుచరులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని అరెస్ట్ చేయాలంటూన పోలీసులకు సూచించినా పట్టించుకోవడం లేదన్న బాలినేని తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇందుకు నిరసనగా తన నలుగురు గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
నకిలీ డాక్యుమెంట్ల కేసులో ప్రధానంగా అధికార పార్టీ వైసీపీకి చెందిన ఇద్దరు నేతల పేర్లు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరిపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలంటూ ఇప్పటికే బాలినేని పోలీసులకు సూచించారు. అయితే పోలీసులు వారిద్దరపై ఫిర్యాదులు రాలేదన్న సాకుతో అరెస్ట్ చేయకుండా ఉండటంతో.. జనంలో తనపై అనుమానాలు వస్తున్నాయని, వెంటనే ఆరోపణలు వస్తున్న ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేయాలని బాలినేని పోలీసులను కోరారు. కానీ పోలీసులు ఆ ఇద్దరినీ కాకుండా మరో ముగ్గురిని అరెస్ట్ చూపించడంతో.. బాలినేని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తానూ స్వయంగా తన అనుచరులను అరెస్ట్ చేయాలని సూచించినా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి మీనమేషాలు లెక్కించడంపై బాలినేని ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసుల తీరునుతప్పుబడుతూ బాలినేని తన గన్మెన్లను సరెండర్ చేస్తున్నట్టు డీజీపీకి లేఖ రాశారు.
ఇదిలావుంటే.. ఈ లేఖ ఇంకా తమకు అందలేదని జిల్లాలోని పోలీసు ఉన్నతాదికారులు చెబుతున్నారు. ఒంగోలులో కలకలం రేపుతున్న నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణం కేసులో తన అనుచరులు ఉన్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ.. తానే స్వయంగా ఎంత పెద్దవారైనా ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే.. కేసు నమోదు చేసి విచారించాలని సూచించినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నది బాలినేని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోన్ సముదాయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసు 10 దర్యాప్తుబృందాలతో విచారణ చేయిస్తామన్న డీజీపీ వివరిచినట్లు తెలుస్తోంది. నిందితులెవరైనా సరే విచారించి చర్యలు తీసుకుంటామని బాలినేనికి డీజీపీ హామీ ఇచ్చినట్లు సమచారం.
మరోవైపు ఈ నకిలీ డాక్యుమెంట్లతో చేసిన భూ కుంభకోణం కేసుల్లో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. బాధితులు ఇంకా వస్తున్నందున కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారు ఏ పార్టీకి చెందిన వారైనా అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరుస్తామని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని ఇంకా గుర్తిస్తున్నామని, కొంతమంది పరారీలో ఉన్నారని ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి వివరించారు. సిట్ దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో నిందితులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలఅధికారులు సహకరించినట్టు తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.