AP: ప్రభుత్వ ఏర్పాటు వేదికపై కనువిందైన సంఘటన చోటు చేసుకుంది. నటుడు, MLA నందమూరి బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరికి నుదుటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి అయిన భువనేశ్వరిపై పలువురు వైసీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, దానికి చంద్రబాబు కన్నీరు పెట్టడం, ఎన్నడూ లేనిది భువనేశ్వరి స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడం మనకు తెలిసిందే. అవి గుర్తు చేసుకొని ఆమె తాజాగా ఎమోషనల్ అయ్యారు.