ప్రభాస్ తరవాత ఇక పవన్‌తో చాటింగ్
డిసెంబర్ 27 (ఆంధ్రపత్రిక): నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ’అన్‌స్టాపబుల్ సీజన్`2’ డబుల్ సందడితో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్`1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్`2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వస్తుంది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో బాలయ్య చేసిన అల్లరి ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఇక త్వరలోనే ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇటీవలే రిలీజైన ప్రభాస్ ప్రోమోతో ఈ ఎపిసోడ్‌పై ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇది టెలికాస్ట్ అవకముందే.. మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రానున్నట్లు వార్తలు రావడంతో ప్రేక్షకులలో మరింత హైప్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు టాక్‌షోలకు రాని పవన్ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకు రావడంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్, క్రిష్ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్ సెట్స్లోఎన్వికె పిఎస్‌వికె అంటూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.