కంటెంట్ బాగుంటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఈ విషయం ‘బలగం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సాధించింది.తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని.. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. బలగం రిలీజై 23 రోజులు పూర్తయ్యేసరికి రూ.23.59 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని తెరపై చక్కగా చూపించారని వేణుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వేణు డైరెక్షన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఓటీటీలోనూ అదే దూకుడు
ఓటీటీలోకి వచ్చేసిన బలగం సినిమా అక్కడ కూడా అదేస్థాయిలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండగా.. అక్కడ కూడా టాప్-2 లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ సినిమా తీసేందుకు మొత్తం బడ్జెట్ రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ లెక్కన చూస్తే బలగం కలెక్షన్స్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నయి. చిన్న సినిమా అయినా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. వేణు ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!