కె.కోటపాడు,ఫిబ్రవవరి14(ఆంధ్రపత్రిక):“విషయ అభ్యాసన అభివృద్ధి” కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల విజ్ఞాన్ని అభివృద్ధి చేయాలని “లిప్ “(లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) రాష్ట్ర పరిశీలకులు జి.జి.ఎస్.నాగేశ్వరరావు అన్నారు.”లిప్” కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ హైస్కూల్లో సాంఘిక శాస్త్రంపై ఉపాధ్యాయులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ బోలెం సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చోడవరం, సబ్బవరం, కె.కోటపాడు మండలాలకు చెందిన41 ప్రభుత్వపాఠశాలలనుంచి 53ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరినుద్దేశించి పరిశీలకులు మాట్లాడుతూ ఈ “లిప్” కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్నారు.”లిప్” జిల్లా నోడల్ అధికారి అర్.వి.గిరి మాట్లాడుతూ “విషయ అభ్యాసన అభివృద్ధి” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెనుకబడిన విద్యార్థులను మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించారు. హెచ్.ఎం.బిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా “లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం”లునిర్వహించ నున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఇమంది వెంకటభవాని, పి.రామ్మోహనరావు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!