గతంలో అక్కచెల్లెమ్మలను మోసం చేసిన బాబు
14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టిన చంద్రబాబు
గత ప్రభుత్వ బకాయిలన్నీ నేనే చెల్లించా
చంద్రబాబు తీరుతో మోసపోయిన అమాయకులు
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే నరకమే
కోనసీమలో సున్నావడ్డీ పథకం ప్రారంభం
9.48 లక్షల సంఘాలకు రూ.1,353.76 కోట్ల చెల్లింపు
బటన్ నొక్కి విడుదల చేసిన సిఎం జగన్
అమలాపురం,ఆగస్టు 11 (ఆంధ్రపత్రిక)ః గత ప్రభుత్వంలో అక్క, చెల్లమ్మలను మోసం చేశారని.. 14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని చంద్రబాబు ప్రభుత్వంపై సిఎం జగన్ విమర్శలు గుప్పించారు. గత సర్కారు బకాయిలు పెట్టి డబ్బును తాము చెల్లించామని చెప్పారు. చంద్రబాబు వల్ల అనేక మంది అమాయకలు మోసపోయారని ఆరోపించారు. దేవుడి దయ వల్ల ఈరోజు మహిళలకు మంచి చేసే వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. నాలుగో విడదల నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్కచెల్లెమ్మల సాధికారిత కోసం అడుగులు వేశామన్నారు. కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది కలుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కుతోచడం లేదని.. వారి మైండ్లో ఫ్యూజులు ఎగిరిపోయాయంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 2016లో చంద్రబాబు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్ కు దిగజారాయన్నారు. ఇంత మంచి పథకాలను గత ప్రభుత్వలా హయాంలో అసలు చూసైనా ఉండరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందా అని ప్రశ్నించారు. విూ బిడ్డల భవిష్యత్ గురించి ఏనాడైనా ఆలోచించారా అని అడిగారు. అలాగే పేద పిల్లలకు ఇంగ్లీషు విూడియం బడులు పెడితే అడ్డుకోవాలని చూశారని, పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే కూడా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలు, వెన్నుపోటులే గుర్తొస్తాయి తప్పితే.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని చెప్పారు. బాబు కోసం ఆయన దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు గనుక మరోసారి సీఎం అయితే ప్రజలకు ఏమాత్రం మంచి జరగదని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తారని, అందుకే ఆయనకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించారన్నారు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు బెదిరించారన్నారు. అలాగే మొన్నటి పుంగనూరు ఘటన గురించి తెలిసి తాను చాలా బాధ పడినట్లు వెల్లడిరచారు. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలనిపించిందని చెప్పారు. ఒక రూట్ లో పర్మిషన్ తీసుకొని ఇంకో రూట్ లో వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు. 47 మంది పోలీసులకు గాయాలు అయ్యేలా చేశారని.. ఓ పోలీసు అయితే కన్నే పోగొట్టు కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడడం లేదని రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారని ఆరోపించారు. విూ జీవితాలు, విూ బిడ్డల జీవితాలు ఏమాత్రం బాగుండాలనుకున్న చంద్రబాబుకు ఓటు వేయొద్దని వివరించారు.