బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ’హరిహర వీరమల్లు’చిత్రంతో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల బాబీ డియోల్ సెట్లో అడుగుపెట్టారు. ఇందులో ఆయన ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడారు. పవన్‌కల్యాణ్ కల్యాణ్ క్రేజ్ గురించి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ప్రస్తుతం తెలుగులో హరిహర వీరమల్లు’ చిత్రం చేస్తున్నా. నాకు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. పవన్‌కల్యాణ్ లాంటి హంబుల్ పర్సన్‌తో పని చేయడం కొత్త అనుభూతినిస్తుంది. జనాల్లో ఆయనకున్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఆయన గెస్ట్‌గా వెళ్లిన కొన్ని కార్యక్రమాలను. పొలిటికల్ స్పీచ్‌లను వీక్షించా. జనాల్లో ఆయనకున్న క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది. అంతా స్టార్డమ్ ఉన్నా చాలా హంబుల్‌గా, సింపుల్‌గా ఉంటారు. అదే నాకు ఆయనలో బాగా నచ్చింది‘ అని చెప్పారు. ఈ చిత్రంతోపాటు ఆయన హిందీలో హౌస్‌ఫుల్ 5, యానిమల్, ది దేశీ షెర్లాక్, అప్నే 2 చిత్రాల్లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ మొగల సామ్రాజ్యం నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే పాత్రలో కనిపిస్తారని సమాచారం. నిధీ అగర్వాల్ కథానాయిక. నర్గీస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!