అయ్యన్న పాత్రుడి రిమాండ్‌ను తిరస్కరించిన కోర్టు
న్యాయం గెలిచింది.. న్యాయమే గెలుస్తుంది: చంద్రబాబు
అమరావతి,నవంబర్ 3 (ఆంధ్రపత్రిక): తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఇవాళ తెల్లవారుజామున అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్‌ను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు.నిబంధనలకు విరుద్ధంగా అయ్యన్నను అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి… అయ్యన్న రిమాండ్ ను తిరస్కరించారు. ఈకేసులో 467 సెక్షన్ వర్తించదని స్పష్టం చేసిన న్యాయస్థానం.. 41ఏ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది.
న్యాయం గెలిచింది.. న్యాయమే గెలుస్తుంది: చంద్రబాబు
అయ్యన్నకు న్యాయస్థానం రిమాండ్ తిరస్కరించడంపై తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా స్పందించారు. కోర్టు రిమాండ్ తిరస్కరించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. న్యాయం గెలిచింది.. న్యాయమే గెలుస్తుందంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అయ్యన్నతో తాము ఉన్నామంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టారు.