తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ట్రస్టు. ఆ ట్రస్టు పరిధిలో కొనసాగే ఆలయ నిర్వహణ, పద్దతులు, ఆచారాలు ఒక క్రమపద్దతిలో జరుగుతుంటాయి. అందుకే ప్రపంచంలోని ప్రముఖ ఆలయాలు సైతం టీటీడీ పద్ధతులను ఫాలో అవకావడానికి ఇష్టం చూపుతుంటాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ట్రస్టు. ఆ ట్రస్టు పరిధిలో కొనసాగే ఆలయ నిర్వహణ, పద్దతులు, ఆచారాలు ఒక క్రమపద్దతిలో జరుగుతుంటాయి. అందుకే ప్రపంచంలోని ప్రముఖ ఆలయాలు సైతం టీటీడీ పద్ధతులను ఫాలో కావడానికి ఇష్టం చూపుతుంటాయి. పూజ కార్యక్రమాల మొదలుకొని ఆర్తిక లావాదేవీలకు ప్రతి అంశాన్ని టీటీడీ తరహాలో నిర్వహించుకోవాలనుకుంటాయి. అయితే ఇటీవల అంగరంగ వైభవంగా ఆయోధ్య ఆలయం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా అయోధ్య ట్రస్టు కూడా టీటీడీ తరహా మేనేజ్ మెంట్ ను అడాప్ట్ చేసుకోవాలని భావిస్తుంది.
టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి శని, ఆదివారాల్లో అయోధ్య రామమందిరాన్ని సందర్శించి అయోధ్య రామమందిర ట్రస్ట్ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో ఏటా 3 కోట్ల మంది భక్తులను ఆకర్షిస్తున్న తిరుమలలో అమలు చేస్తున్న ఉత్తమ రద్దీ నిర్వహణ పద్ధతులను టిటిడి ఈవో ప్రదర్శించనున్నారు. క్యూలైన్ల నిర్వహణ, యాత్రికుల రద్దీ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వసతి, దర్శనానికి సంబంధించిన అంశాలు సహా క్రౌడ్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన వివిధ అంశాలను ధర్మారెడ్డి రామమందిర ట్రస్టుకు వివరించనున్నారు.
మహారాష్ట్రలోని షిర్డీ సంస్థాన్, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం, కాశీవిశ్వనాథ ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు గతంలో తిరుమలలో అనుసరించిన కొన్ని ఉత్తమ పద్ధతులను తమ తమ ఆలయాల్లో అనుసరించడానికి అవలంబించడానికి టిటిడితో గతంలో సంప్రదింపులు జరిపారనే విషయాన్ని గుర్తు చేశారు.
శుక్రవారం నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం గంటపాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు రామాలయ ప్రధాన అర్చకుడు శనివారం ప్రకటించారు. అయోధ్యలోని రామ మందిర తలుపులు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మీడియాకు తెలిపారు. అయోధ్య రామ మందిరాన్ని రోజూ గంటపాటు మూసివేయనున్నారు. జనవరి 22న జరిగిన ప్రతిష్ఠా కార్యక్రమం అనంతరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు పెంచింది. ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శన సమయం, మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటలవరకు రెండు గంటల విరామం ఉంటుంది.