తిరుమల,మార్చి24 ఆంధ్రపత్రిక : చాలామంది డబ్బు ఉన్నా ఒంటికి సుఖం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం మానసిక ప్రశాంతతను కోల్పోవడమే. అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధ పడుతున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలతో మానసిక సమస్యల బారిన పడుతున్నారు. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ బంధువులు, బాంధవ్యాలను తెంచుకుంటే తిరిగి రావు. అందుకే వ్యసనాలకు, ఆందోళనకు స్వస్తి చెప్పి ప్రశాంతంగా నవ్వూతూ ఉంటే మానసిన ప్రశాంతత విూ సొంతం అవుతుంది. కష్టాలు, బాధలు, లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. వాటిని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటే మనకే నష్టం. మనసు బాగుంటే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటేం దనే విషయాన్ని గుర్తించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నానుడు. ఆరోగ్యం బాగుంటే అంతా బాగుంటుంది. అందుకు ఆధ్యాత్మిక చింతన కూడా ముఖ్యమే. కాని నేడు మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. అప్పటి కాలాన్ని అన్వయించుకుని నాటి పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. ఒకటే టెన్షన్.. టెన్షన్.. ఉరుకులపరుగల జీవితం. కనీసం కుటుంబ సభ్యులతో సైతం గపడలేని దయనీయత. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. శారీరక ఆరోగ్యంతో పాటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బంధాలు పెంచుకోవాలి. మానసిక ఆరోగ్యం ఎంతోగానో దోహదం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. సమాజం వేగంగా పరిగెడుతోంది. అందరి కంటే నేనే ముందుండాలి. రేపటిని ఈ రోజే చూడాలి. ప్రపంచాన్ని గెలవాలనే టెన్షన్‌తో అనేక మంది జీవితంలో నిరంతరం పరుగులు పెడుతున్నారు. ఆ వేగంలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయిన వాళ్లను కూడా పట్టించుకోవడం లేదు. బంధాలను మరిచిపోతున్నారు. జీవితంలో వేగం ఉండాలే కాని వేగమే జీవితం కాకుడదు. బాధల్లో , కష్టాల్లో ఉన్నప్పుడు మన వాళ్లు తోడుంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది. మానసిక ఆరోగ్యమే మహా భాగ్యం అనే విషయాన్ని మనసా, వాచా, కర్మణా నమ్మి ఆ దిశగా మహాభాగ్యాన్ని పొందాలి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!