Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!
Author: admin
31న తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు ANDHRAPATRIKA : – నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో అక్టోబరు 31న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీపావళి ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని ఆ రోజున టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, దీపావళి రోజున సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించరు. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. దీనిపై టీటీడీ స్పందిస్తూ, అక్టోబరు 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
Top 6 News @ 6PM: జగన్ విషపు నాగు, చంద్రబాబుతో నాకేం సంబంధం: షర్మిల.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్ ANDHRAPATRIKA : – Top 6 News @ 6pm: ఇవాళ అక్టోబర్ 27న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. 1) విజయసాయి రెడ్డికి షర్మిల సవాల్ ఆస్తుల కోసం, సొంత ప్రయోజనాల కోసం కన్న తల్లిని కోర్టుకీడ్చిన వైఎస్ జగన్ విషపు నాగు కాదా అని వైఎస్ షర్మిల అన్నారు. తనపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికగా షర్మిళ స్పందించారు. వైఎస్ఆర్ ఆస్తుల్లో నలుగురు మనవళ్లకు సమాన హక్కులు ఉన్నాయని వైఎస్ రాజశేఖర్ రెడ్డి…
Tamilnadu Politics: ఎన్టీఆర్ స్పూర్తితోనే.. విజయ్ సంచలన వ్యాఖ్యలు ANDHRAPATRIKA : – చెన్నై, అక్టోబర్ 27: తనను సినిమా ఆర్టిస్ట్ అంటూ కొందరు పేర్కొంటున్నారని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ పేర్కొన్నారు. అయితే తమిళనాట ఎంజీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారని ఈ సందర్భంగా విజయ్ గుర్తు చేశారు. ఆదివారం విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మహానాడును విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహాసభకు లక్షలాది మంది ప్రజలు, విజయ్ అభిమానులు పోటెత్తారు. ఈ సందర్బంగా హీరో విజయ్ మాట్లాడుతూ.. పెరియార్ ఈవీ రామసామి, కె. కామరాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, వేలు నాచియార్, అంజలై అమ్మాళ్ వేసిన బాటలోనే తమిళగ వెట్రి కజగం (టీవీకే) పయనిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. సినిమాల్లో హీరోగా నటిస్తూ తాను అత్యున్నత శిఖరాల్లో అధిరోహించానన్నారు. అలాగే అత్యధిక పారితోషకం తీసుకుంటూ..…
Raj Pakala: రాజ్ పాకాల సోదరుడి ఇంటి దగ్గర హైటెన్షన్.. బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ ANDHRAPATRIKA : – రాయదుర్గం లోని ఓరియన్ విల్లాస్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర ఇంటి తలుపులు ఓపెన్ చేసి, ఎక్సైజ్ అధికారులు లోపలికి వెళ్లారు. లోపల విదేశీ మద్యం దాచి ఉంటారనే అనుమానాల్ని అధికారులు వ్యక్తం చేశారు. గంటపాటూ బీఆర్ఎస్ నేతలతో వాదన తర్వాత అధికారులు ఆ ఇంట్లోకి వెళ్లగలిగారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో.. అటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. రెండువైపులా తోపులాట జరుగుతోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తల్ని అరెస్టు చేసి పోలీసులు అక్కడి నుంచి గచ్చిబౌలి పీఎస్ కి తరలించారు. వివేకానంద, బాల్కసుమన్, పల్లా, సంజయ్, క్రిశాంక్‌ని అరెస్టు చేశారు. అంతకుముందు అధికారులు వస్తున్నారనే విషయం తెలిసి భారీగా వచ్చిన…
శుభోదయం అందరికీ!!! ANDHRAPATRIKA : – మన మనస్సు నీ వికసింపచేసే గుణం పువ్వులకి ఉన్నది. పువ్వులను ఆధ్యాత్మికంగా భగవంతునికి సమర్పిస్తాము, అందం, అలంకరణంగా వాడుతాము,జవానుల త్యాగానికి సమర్పిస్తాము. ప్రతికూల శక్తిని అనుకూల శక్తిగా మార్చే గుణం పువ్వులకు సొంతం.అటువంటి కుసుమాల దినోత్సవం (ఫ్లవర్స్ డే ) మా యు.కే.జి విద్యార్థులు జరుపుకోవడం ఆనందంగా ఉన్నది. అనాది కాలం నుండి వస్తున్న ఆచార, వ్యావహారిక, ఆహారపు అలవాట్లు మనం వారసత్వంగా పునికి పుచ్చుకున్నాము, వాటిని ఈ 21 వ శతాబ్దం లో కూడ పాటిస్తున్నాము. వస్త్ర వేష ధారణ అనేది మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం. ఒక్కో ప్రాంతపు వాతావరణ పరిస్థితుల్ని బట్టి మనము ధరిస్తున్నాము, ఆహారపు అలవాట్లు కూడా మన శరీరానికి, ప్రాంతానికి అనుగుణంగా తీసుకుంటున్న పోషణ. సంపద, జ్ఞానం వీటితో పాటు ఆచార, ఆహార అలవాట్లను వారసత్వంగా మనకు అందించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారసత్వ దినోత్సవం (…
అపార్ట్మెంట్లు ఇరుకుటెంట్లు. నగరంలో కొన్ని అపార్ట్మెంట్లలో ఏక వ్యక్తి పరిపాలనే. కమిటీ ప్రెసిడెంట్ మాటే వాచ్మెన్ కి వేదం. ప్రతి రెండు సంవత్సరాలకు కమిటీ మార్చుకోవాలని పోలీసు శాఖ సూచన. పాలన నిర్లక్ష్యం వల్ల కొంతమంది వాచ్మెన్ లదే ఇష్టారాజ్యం. అపార్ట్మెంట్లలో కనీస పరిశుభ్రత పాటించని వైనం. పోలీసు గస్తీ లేని అపార్ట్మెంట్లు. కొన్ని ప్రాంతాల్లో బ్లేడు బ్యాచి, గంజాయి బ్యాచ్ తిరుగుతున్నా, పట్టించుకోని పోలీస్ శాఖ. మచిలీపట్నం అక్టోబర్ 27 ఆంధ్ర పత్రిక. మధ్యతరగతి మానవుడు స్థలం కొని ఇల్లు కట్టే స్థితి లేక, గ్రూప్ హౌస్ లో కానీ, అపార్ట్మెంట్ కానీ,కొనుక్కుని ప్రశాంతంగా అందులో స్థిర పడదామని ఆలోచిస్తాడు. కానీ అతని ఆలోచనలకు భిన్నంగా అక్కడ పరిస్థితులు ఉంటున్నాయి. అపార్ట్మెంట్ కొన్నాము అన్న ఆనందం కంటే, మానసిక శాంతి కరువై నిస్తేజంగా మారిపోతున్నాడు. నగరంలో కొన్ని అపార్ట్మెంట్లలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఉదాహరణకు స్థానిక రుస్తుంబాదా పార్కు…
Viral: హైదరాబాదీ ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆనంద్ మహీంద్ర.. చిత్ర విచిత్రమైన కార్లు.. ANDHRAPATRIKA : – – సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతీ ఒక్కరికీ ఆనంద్ మహీంద్ర గురించి తెలిసే ఉంటుంది. మహీంద్రా గ్రూప్ అధినేతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఆసక్తికర విషయాలు జరిగినా వాటిని వెంటనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా వెరైటీ కార్లను తయారు చేస్తున్నారు. ఈ వాహనాలతో ఆయన ఓ మ్యూజియంను సైతం ఏర్పాటు చేశారు. పెన్సిల్, షూ, షార్ప్‌నర్, పిజ్జా.. ఇలా రకరకాల ఆకారాల్లో కార్లను తయారు చేసి ఏకంగా గిన్నిస్ రికార్డులో సైతం చోటు దక్కించుకున్నారు సుధాకర్. తాజాగా ఇయనపై ఆనంద్ మహీంద్ర దృష్టిపడింది.…
Telangana Police: పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. ధర్నా చేసిన 39 మంది కానిస్టేబుళ్ల సస్పెండ్ ANDHRAPATRIKA : – – ఇన్నాళ్లు సమాజంలో ప్రజలు, ఇతర వర్గాలు ధర్నాలు చేస్తే, ఇప్పుడు పోలీసులు, వారి కుటుంబాలే నిరసనకు దిగుతుండటం సంచలనంగా మారింది.. తమను వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆందోళనలు నిర్వహించారు. సంబంధం లేని పనులు చేయిస్తున్నారని.. తమిళనాడు, కర్ణాటక మాధిరి ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ పోలీసులు డిమాండ్ చేశారు. అయితే.. బెటాలియన్ పోలీసుల ఆందోళనలపై పోలీస్‌శాఖ సీరియస్ అయింది. పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న వారు, ఇష్టానుసారంగా టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న వారిని గుర్తించింది పోలీసు శాఖ. ఆందోళనలను ప్రేరేపిస్తూ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్న కొందరిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. ఆర్టికల్ 311 ప్రకారం వారిని ఉద్యోగాల నుంచి సస్పెండ్…
Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-లారీ ఢీ.. ఆరుగురు ఇస్కాన్ ప్రతినిధులు మృతి! ANDHRAPATRIKA : – – అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగనమల మండలం నాయన పల్లి క్రాస్ వద్ద కారు లారీ ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం వైపు నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ.. తాడిపత్రి వైపు నుంచి అనంతపురం వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో స్పాట్‌లోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతపురం తాడిపత్రి రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా.. వన్ వే లో వెళ్తున్న కారు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన ప్రతినిధులు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో.. లారీ కిందకు కారు ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికులు కారులో ఉన్న…
CM Chandrababu: క్వార్టర్ 99 దాటితే తిరగబడరా సామీ..! ఇకపై ఆ దందాలను సహించం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ANDHRAPATRIKA : – – ప్రజల చేతికే పవర్. తిరగబడరా సామీ అనే రేంజ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.. ఇసుక అక్రమ దందా చేసినా.. మద్యం అధిక ధరకు విక్రయించినా తిరగబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. అంతేకాదు.. ఇసుక మద్యం దందాల్లో జోక్యం చేసుకోవద్దని టీడీపీ శ్రేణులకూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. మంగళగిరిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పలు విషయాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.. ఎవరూ ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. ఇసుక అక్రమ దందా చేసేవాళ్లపై తిరుగుబాట చేయాలని ప్రజలకు పిలుపినిచ్చారు.. ఇక బాటా తరహాలో ఏపీలో మద్యం రేటు రూ 99కి ఫిక్స్డ్. అంతకు మించి ఒక్క పైసా వసూల్…