Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!
Author: admin
వీళ్లేం మనుషులు రా స్వామీ.. దీన్ని కూడా వదలరా.. పక్కా నిఘాతో గుట్టరట్టు..! ANDHRAPATRIKA : – – స్మగ్లింగ్‌కు కాదేది అనర్హం అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. అటవీ ప్రాంతంలో దొరికే ప్రతి దానిని స్మగ్లింగ్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా కడప అటవీ ప్రాంతంలో దొరికే అరుదైన ఎర్రచందనం దగ్గర నుంచి మూగజీవాల వరకు అన్నింటిని దోచేసి దాచేసుకుంటున్నారు. తాజాగా మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కడప అటవీ ప్రాంతాలలో అరుదుగా దొరికే అలుగును స్మగ్లింగ్ చేస్తూ కొంత మంది స్మగ్లర్లు పట్టుబడ్డారు. అలుగు ఇది చాలామందికి తెలియని ఒక అటవీ ప్రాంతానికి చెందిన జీవి. అలుగుకు మనదేశంలోనే కాక విదేశాలలో కూడా మంచి డిమాండ్ ఉంది. కడప జిల్లాలోని కొండ ప్రాంతమైన దట్టమైన అడవిలో అలుగు జీవులు ఉంటాయి. అయితే బద్వేల్ రేంజ్ లోని అటవీ ప్రాంతంలో ఈ అలుగు దొరికింది. ఇది అంతరించిపోతున్న జాబితాలో ఉంది. ఈ…
చదువుల తల్లికి అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇంటికి పిలిచి మరీ..! ANDHRAPATRIKA : – – మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చదువుల తల్లికి అండగా ఉంటాని భరోసా ఇచ్చారు. ఎంబీబీఎస్ సీటోచ్చినా.. కూలీ పనులకు వెళ్తున్న విద్యార్థిని గురించి తెలుసుకుని చలించిపోయారు. వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చదువుకునేందుకు ఆర్ధిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం, సలాబత్ పూర్ గ్రామానికి చెందిన కాట్రోజు సుమలత మెడిసిన్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించింది. కుటుంబ పరిస్థితులు తెలిసి చదివే స్తోమత లేక కూలీ పనికి వెళ్తోంది. వారి కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి చలించిపోయారు. వెంటనే వారిని పిలిపించుకుని మాట్లాడారు. ప్రతిభావంతురాలైన సుమలత చదువులకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డుగా మారకూడదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాను సుమలతకు అండగా ఉంటానని హామీ…
Sundar Pichai: సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు.. 25శాతం కోడింగ్ ఏఐతోనే అంటూ.. ANDHRAPATRIKA : – – ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ కోడ్‌ను రూపొందించడానికి కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడుతోందని సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా సుందర్ పిచాయ్ తన బ్లాగ్ పోస్ట్‌లో పంచుకున్నారు. జనరేట్ చేసిన కోడ్‌ను ఇంజనీర్లు రివ్యూ చేస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిందని తెలిపారు. గుగూల్ అభివృద్ధిలో కృత్రిమ మేధది కీలక పాత్ర అని సుందర్ పిచయ్ చెప్పుకొచ్చారు. గూగుల్‌లో కొత్త కోడింగ్‌లో 25 శాతానికిపైగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమయాన్ని…
FD Interest Rates: ప్రత్యేక ఎఫ్‌డీల ద్వారా వడ్డీల జాతర.. ఏ బ్యాంకు అధిక వడ్డీ ఇస్తుందంటే..? ANDHRAPATRIKA : – – ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో స్థిరత్వంతో పాటు హామీతో కూడిన రాబడిని కోరుకునే వ్యక్తులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడులు మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఎఫ్‌డీ ఎంపికల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్-ఫ్రెండ్లీ సేవలను అందిస్తున్నాయి. అయితే ఈ రెండు బ్యాంకులు 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లను అందిస్తున్నాయి. ఈ ప్రత్యేక ఎఫ్‌డీలను ఏ బ్యాంకులో తీసుకుంటే అధికంగా మేలు జరుగుతుందో? ఓ లుక్కేద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ప్రత్యేక ఎఫ్‌డీ కోసం సాధారణ కస్టమర్‌లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీ అందిస్తుంది. అమృత్ కలశ్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ పథకం మార్చి…
Real Estate: ఐపీఓల ద్వారా రూ.13,500 కోట్లు సమీకరించిన భారతీయ రియల్ ఎస్టేట్ రంగం ANDHRAPATRIKA : – – భారతదేశంలోని రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది ఇప్పటి వరకు మార్కెట్ల నుండి ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ల (ఐపిఓలు) ద్వారా దాదాపు రూ. 13,500 కోట్లను సమీకరించింది. 2023లో సేకరించిన మొత్తం కంటే దాదాపు రెండింతలు. మంగళవారం నాటి నివేదిక ప్రకారం.. అనేక రంగాలలో 123 తాజా ఇష్యూలు (అక్టోబర్ 20 నాటికి), 2023లో చూసిన మొత్తం IPOల సంఖ్యను 2024 ఇప్పటికే అధిగమించిందని కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. 2021 నుండి 2017-2020 మధ్యకాలంలో గత నాలుగు సంవత్సరాలలో 11 లిస్టింగ్‌ల కంటే, 21 రియల్ ఎస్టేట్ ఐపీవోలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా మహమ్మారి అనంతరం 21 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 31,900 కోట్లను సమీకరించాయి. అంతకుముందు నాలుగేళ్ల కాలంలో (2017-2020) సేకరించిన నిధుల…
టిచర్ అంటే ఇలా ఉండాలి.. ‘నాసా’నే విద్యార్థులకు వద్దకు.. ANDHRAPATRIKA : – – బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం పాఠశాల విద్యార్దులు నాసా సైంటిస్టుతో మాట్లాడి తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పాఠశాలలో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ హరిక్రిష్ణ పెన్‌పాల్ అనే కార్యక్రమాన్ని రూపొందించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా వివిధ దేశాల్లో ఉన్న విద్యార్ధులతో వీడియో కాల్స్ సాయంతో మాట్లాడిచేవారు. గతంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్ధులతో వారి సంస్కృతి, సాంప్రదాయాలు భాష వంటి అంశాలపై ఐలవరం పాఠశాల విద్యార్ధులు మాట్లాడారు. టీచర్ హరిక్రిష్ణ నాసా శాస్త్రవేత్త హెన్రీ ట్రూప్‌తో మాట్లాడి తమ పాఠశాల విద్యార్ధులకు స్పైస్ టెక్నాలజీలో ఉన్న సందేహాలను తీర్చాలని కోరారు. సానుకులంగా స్పందించిన ఆమె ఐలవరం పాఠశాలలో ఎంపిక చేసిన విద్యార్ధులతో వీడియో కాల్ సాయంతో హెన్రీ ట్రూప్ ముచ్చటించారు. విద్యార్ధుల ప్రశ్నలకు ట్రూప్ ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఆ తర్వాత…
Firing: సైలెంట్ ఫైరింగ్‌ను ఫాలో అవుతోన్న కంపెనీలు.. అసలేంటిది.? ANDHRAPATRIKA : – – -ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా భారీగా ఉద్యోగాల్లో కోత తప్పదని వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి కూడా. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు మల్టీ నేషనల్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. అయితే ఇదే సమయంలో కంపెనీలు ఒక సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. సైలెంట్ ఫైరింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంతకీ అసలేంటీ సైలెంట్ ఫైరింగ్ ట్రెండ్ ఇప్పుడు తెలుసుకుందాం.. కంపెనీలు ఉద్యోగులను తొలగించడకుండా.. తామంతటతామే ఉద్యోగం నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నాయి. దీనినే సైలెంట్ ఫైరింగ్‌గా చెబుతున్నారు. ఉద్యోగులు చేసే పనిని కష్టతరం చేసి వారంతటవారే ఉద్యోగం నుంచి రాజీనామా చేసేలా చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల స్థానంలో ఏఐని భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ప్రాస్పరే.ఏఐ అనే సంస్థ సీఈఓ మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత…
Salman Khan : రెండు కోట్లు పంపండి.. లేదంటే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాను.. మరోసారి హత్య బెదిరింపులు.. ANDHRAPATRIKA : – – బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు కొన్ని రోజులుగా హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలోని లారెన్స్ బిష్ణోయ్ వర్గం సల్మాన్ ను చంపేస్తామని ఇదివరకు చాలాసార్లు బెదిరింపులు లేఖలు పంపించింది. అలాగే బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు కూడా జరిగాయి. ఇక ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ తోపాటు పలువురు బీటౌన్ స్టార్స్ కు ముంబై పోలీసులు భద్రత మరింత పెంచారు. ఇదిలా ఉంటే.. నిన్న మంగళవారం సల్మాన్‌ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. నిన్న ఉదయం ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ రూంకు ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు తెలుస్తోంది. “రూ.2 కోట్లు ఇవ్వాలని.. లేదంటే సల్మాన్ ఖాన్ ను చంపేస్తాను” అని బెదిరింపు రావడంతో…
Tirumala: వెంకన్న దర్శనం విషయంలో స్వామీజీలు అలక.. అడిషనల్ ఈవో వర్సెస్ స్వామీజీలు ANDHRAPATRIKA :- తిరుమల వెంకన్న క్షేత్రంలో స్వామీజీలకు శ్రీవారి దర్శన భాగ్యం కలగక పోవడం మరో వివాదంగా మారింది. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26న తిరుపతిలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన స్వామీజీలు శ్రీవారి దర్శనం చేసుకోకుండానే వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇప్పుడు స్వామీజీలు, టీటీడీ అదనపు ఈఓ మధ్య వివాదంగా నిలిచింది. ఈ నెల 26 న తిరుపతిలో జరిగిన జాతీయ హిందూ ధార్మిక సదస్సులో పాల్గొన్న స్వామీజీలు పలు డిమాండ్లను తెరమీదకి తెచ్చారు. భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న తిరుపతి పవిత్రతను మరింత పెంచాలన్న వాదన వినిపించిన స్వామీజీలు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన స్వామీజీలు మాతాజీలు పాల్గొన్న ధార్మిక సదస్సు పలు తీర్మానాలను చేశారు. తిరుపతిలో మద్యం మాంసం అమ్మకాలు లేకుండా చేయాలన్న ప్రధాన డిమాండ్…
ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ మరెక్కడైనా చూపిస్తే .. లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్! ANDHRAPATRIKA : – దీపావళి సెలవులకు ముందు పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహార యాత్ర మొదలైంది. నాలుగు నెలల తర్వాత మళ్ళీ పాపికొండలు విహార యాత్ర స్టార్ట్ కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు బోట్‌లో షికార్లు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సందడి మధ్య టూరిస్టులు తొలి రోజు పాపికొండల విహార యాత్ర కొనసాగించారు. పర్యాటకులు తరలి రావడంతో గండి పోచమ్మ పరివాహక ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు 41 మందితో కావేరి బోట్ పాపికొండలు విహార యాత్రకు వెళ్లింది. లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక తనిఖీలు తర్వాత పర్యాటక శాఖ అధికారులు బోట్‌కు అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే పాపికొండలు పర్యటనకు 15 బోట్లకు ఫిట్నెస్, లైసెన్స్ ఇచ్చారు. పాపికొండల టూర్‌కు అనుమతి…