Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
Author: admin
ప్రపంచంలో ఇప్పటి వరకూ మూడు దేశాలు మాత్రమే జీపీఎస్ ఆధారంగా విమానాల ల్యాండిరగ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వాటి సరసన భారత్‌కు చేరింది. ఇప్పటి వరకైతే జీపీఎస్ సాయంతో వాహనాలను నడుపుతున్నాం. ఇక, నుంచి విమానాలను కూడా ల్యాండ్ చేయనున్నారు. ఇందుకు ఇస్రో మూడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా రాజస్థాన్‌లోని విమానాశ్రయంలో పరీక్షించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో త్వరలో అన్ని విమానాలకు దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.దశాబ్దాలుగా వాహనదారులకు నావిగేట్ చేయడంలో ఉపగ్రహాలు సహాయపడుతున్నాయి. తాజాగా, జీపీఎస్ సాయంతో విమానం ల్యాండిరగ్ ట్రయల్ రన్‌ను భారత్ విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో ఆసియా`పసిఫిక్ ప్రాంతంలో జీపీఎస్ సాయంతో రన్‌వేపై విమానం ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. శుక్రవారం అజ్మేర్ విమానాశ్రయం రన్‌వేపై నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమయ్యింది. రన్‌వేపై విమానాన్ని పైలట్లు సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆసియా`పసిఫిక్ ప్రాంతంలో ఉప్రగహా ఆధారిత ల్యాండిరగ్‌ను సురక్షితంగా పూర్తిచేసిన మొదటి…
ఎలాన్ మస్క్. మనిషి కాదు రోబోట్ అనిపిస్తారు. ఎవరూ ఊహించనిది ఊహిస్తారు. ఎవరూ సాహసించనిది చేసి చూపిస్తారు. డ్రైవర్ లెస్ టెస్లా కారు తయారీ ఆయనకే సాధ్యమైంది. స్పేస్ టూరిజం సైతం ఆయన అంచనాలను అందుకుంది. ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ.. ట్విటర్ పిట్టను తన పంజరంలో బంధించేసుకున్నారు. మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టాడు. తల్లి అమెరికాన్. తండ్రి సౌత్‌ఆఫ్రికన్. ఇలాంటి అద్భుతాలు, సాహసాలు చేయగలిగేది మస్క్ మాత్రమే. అందుకే, ఆయనో బిజినెస్ టైకూన్. అయినా, ఆయనకు ఓ సొంతిల్లు కూడా లేదంటే నమ్మాల్సిందే. ఎలాన్ గురించి మరిన్ని వివరాలు, విశేషాలు….. తనకు ఉన్న 7 లగ్జరీ బంగ్లాలను అమ్మేస్తున్నట్టు 2020లో మస్క్ ప్రకటించి సంచలనం రేకెత్తించాడు. జీవితంలో వైభవాన్ని తగ్గించుకుంటున్నానని చెప్పి తన 7 విలాసవంతమైన భవనాలను అమ్మేశాడు. ప్రస్తుతం మస్క్ ఓ చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బోక్సబుల్ అనే స్టార్టప్ కంపెనీ ఈ…
డిగ్రీ కోర్సులకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ కోర్సుల వైపు విద్యార్థులు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. కానీ డిగ్రీ కోర్సులు చేసినా ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చుననే ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో కనిపిస్తోంది. డిగ్రీ కోర్సులు పూర్తి చేసి మేనేజ్‌మెంట్ వైపు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బీఎస్సీ, బీకాం, బీఏ వంటి కోర్సులు పూర్తి చేస్తున్న వారు ఎంబీఏ, కామర్స్ కోర్సుల వైపు మొగ్గుచూపి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు దీటుగా వేతనాలు పొందుతున్న వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 14వేల పైచిలుకు ఉంది. రాయలసీమలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ అడ్మిషన్లు జరిగింది అనంతపురం జిల్లాలోనే కావడం విశేషం. తాజాగా…
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పన్నుల పరంపర చిత్రవిచిత్రంగా కొనసాగుతోంది. ఆన్ లైన్ లోపాలతో వెబ్ సైట్లు పనిచేయకపోవడంతో ఖాళీ స్థలాలకు ఇంటి పన్నులు, ఇళ్లకు ఖాళీ స్థలాల పన్నులు వసూలు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సీడీఎంఏ వెబ్ సైట్ లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోపాలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో అందుబాటులో టెక్నాలజీ ఉన్నా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను నిర్ధారించే వెబ్ సైట్ పనిచేయకపోవడంతో ప్రజలు పెద్దఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ లో ఖాళీ స్థలం నుంచి ఇంటి పన్ను మ్యుటేషన్ అయ్యే వెబ్ సైట్ గత ఏడు నెలల నుంచి పనిచేయడం లేదు. కార్పొరేషన్ లోని రెవెన్యూ విభాగానికి సంబంధించిన మరికొన్ని వెబ్ సైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందితో పాటు నష్టాలకు గురవుతున్నారు. కావాలనే అధికారులు ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు ఆన్లైన్ సర్వీస్ లు నిలిపివేసారాన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంవత్సరం…
ఎండలు మండుతుండడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి చల్లదనాన్ని ఇచ్చే అప్లియెన్స్‌లకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతోంది. ఈ సారి సేల్స్ బాగుంటాయని కంపెనీలు ఆశలు పెంచుకుంటున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో టెంపరేచర్లు సాధారణ స్థాయికి కంటే ఎక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే. 2019 సమ్మర్‌తో పోలిస్తే ఈ ఏడాది సమ్మర్‌లో ఏసీల అమ్మకాలు 30 శాతం పెరుగుతాయని కంపెనీలు అంచనావేస్తున్నాయి. మొదటిసారిగా కొనేవాళ్లు, పాత అప్లియెన్స్‌లకు బదులుగా కొత్తవి తీసుకునేవాళ్లు పెరుగుతుండడంతో ఏసీలకు డిమాండ్ ఎక్కువయ్యిందని కంపెనీలు చెబుతున్నాయి. ఇండ్లు, ఆఫీస్‌ల కన్‌స్ట్రక్షన్ పెరగడంతో కూడా ఏసీలకు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు. సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్టవుతోందని, ఏసీలకు మంచి డిమాండ్ ఉందని బ్లూస్టార్ ఎండీ బీ త్యాగరాజన్ పేర్కొన్నారు. 2019 సమ్మర్‌తో పోలిస్తే ఈ సారి సమ్మర్‌లో 20?25 శాతం ఎక్కువ గ్రోత్‌ను నమోదు చేస్తామని ఆయన అంచనావేశారు. డేటా సెంటర్లు, ఫ్యాక్టరీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నుంచి ఏసీల కోసం…
ఫోన్ చేస్తే చాలు ఒకటే కాలర్‌ట్యూన్. ఒకరోజు రెండురోజులో అంటే ఎవరైనా భరిస్తారు. కానీ, ఏళ్ల తరబడి అదే కాలర్‌ట్యూన్ వినాలంటే ఎవరైనా విసుగు చెందుతారు. కరోనా ఏ టైమ్‌లో వచ్చిందోగానీ.. వైరస్ టార్చర్ కంటే ఫోన్లో ఆ కాలర్‌ట్యూనే వినియోగదారులకు ఎక్కువగా టార్చర్ చేసిందనే చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలంటూ సూచన చేయడం మంచిదే అయినా.. ఆ మంచి మరీ శృతిమించిందనే విమర్శ ఉంది. రోజులు, వారాలు, నెలలు, ఏళ్ల తరబడి ఒకటే అరిగిపోయిన రికార్డు వినిపించి వినిపించీ జనాలను ఒక విధంగా వేధించారనే ఆరోపణ కూడా ఉంది. మోదీ సర్కారు ఆ కాలర్ ట్యూన్ పెట్టడం మినహా కొవిడ్ నివారణకు ప్రత్యేకంగా చేపట్టిన చర్యలేవీ లేవని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రెండేళ్లుగా భరిస్తూ వస్తున్న ఆ కరోనా కాలర్‌ట్యూన్ బారి నుంచి ఇకపై విముక్తి లభించనుంది. నమస్కారం.. కొవిడ్`19 అన్‌లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతటా మొదలైంది. ఇలాంటి…
డిజిటలైజేషన్ రేసులో ఫోన్ పే, గూగుల్ పే ముందున్నాయి. వాటి తర్వాతి స్థానాల్లో పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ పే ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ పోటీగా మరో డిజిటల్ పేమెంట్ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా పే పేరుతో టాటా గ్రూప్ డిజిటలైజేషన్ రేసులో అడుగు పెట్టనుంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే టాటా గ్రూప్ సొంత డిజిటల్ పేమెంట్ యాప్ ను ప్రారంభిస్తుందని తెలుస్తోంది. టాటా గ్రూప్ దేశంలో స్వంత యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (ఙఖఎ) ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవను అందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి కోరుతున్నట్లు సమాచారం. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్స్ గా వ్యవహరించేందుకు టాటా గ్రూప్ ఏపిఎన్‌ఐసికి దరఖాస్తు చేసిందని ఆ నివేదిక చెబుతోంది. టాటా గ్రూప్ టాటా న్యూ పేరిట డిజిటల్ సేవలను వీలైనంత త్వరగా లేదా వచ్చే నెలలో ప్రారంభించేందుకు…