Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
Author: admin
ప్రపంచంలోనే అతిపెద్దదైన బెల్జియంలోని చాక్లెట్ ప్లాంట్‌లో సాల్మోనెల్లా బ్యాక్టీరియాను గుర్తించారు. వీజ్ పట్టణంలో ఉన్న ఈ ప్లాంట్‌ను స్విస్ దిగ్గజం బారీ కాల్‌బాట్ కంపెనీ నిర్వహిస్తోంది. మొత్తం 73 మంది క్లెయింట్స్‌కు కాన్ఫెక్షనరీల తయారీ కోసం హోల్‌సేల్‌గా ఇక్కడ లిక్విడ్ చాక్లెట్‌ను ఉత్పత్తి చేస్తారు. అయితే, బ్యాక్టీరియా బయటపడిన వెంటనే ఉత్పత్తిని నిలిపివేసినట్టు కంపెనీ అధికార ప్రతినిధి కోర్నీల్ వార్లోప్ తెలిపారు. బ్యాక్టీరియా బయటపడగానే బారీ కాల్‌బాట్ తమ కస్టమర్లతో మాట్లాడింది. తాజాగా తమ నుంచి అందుకున్న చాక్లెట్ లిక్విడ్‌తో ఎలాంటి ఉత్పత్తులు తయారుచేయొద్దని కోరింది. అంతేకాదు, తదుపరి నోటీసు వచ్చే వరకు వీజ్ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు తెలిపింది.
దేశంలోని ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలను (పీఏసీఎస్) కంప్యూటరీకరించాలని కేంద్రం నిర్ణయించింది. రానున్న ఐదేళ్లలో 63 వేల పీఏసీఎ్‌సల్లో రూ. 2516 కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయితే పాలనలో పారదర్శకత పెరిగి…రైతులకు అందించే సేవలు మరింత మెరుగుపడతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి అయ్యే మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ. 1,528 కోట్లను భరించనుంది. ఇప్పటికే కంప్యూటరీకరణ పూర్తయిన వాటికి రూ.50 వేలు రీయింబర్స్ చేయనుంది. కంప్యూటరీకరణ లేని కారణంగా చాలా పీఏసీఎ్‌సలు సమర్థమంతంగా పనిచేయడం లేదని, డీసీసీబీలకు, రాష్ట్ర సహకార బ్యాంకులకు అనుసంధానం అయ్యే సాఫ్ట్‌వేర్‌లు లేవని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కంప్యూటరీకరణలో భాగంగా రోజువారీ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో ఒకే ప్లాట్‌ఫామ్ ఉంటుందని, కామన్ అకౌంటింగ్ సిస్టమ్ ఉంటుందని పేర్కొంది. దాంతో త్వరగా రుణాలు…
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్‌ని రిటర్నింగ్ అధికారి తిరిస్కరించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన మందాటి తిరుపతి రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్డివాలాతో కూడిన వేకేషన్ ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం-1952లోని సెక్షన్ 5బీ(1)(ఏ) ప్రకా రం తిరస్కరణకు గురైందన్న అంశాన్ని విస్మరించలేమని.. అందువల్ల నామినేషన్‌ని తిరస్కరించడంలో న్యాయపరమైన తప్పిదమేమీ లేదని పేర్కొంది. తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ని కొట్టివేసింది
ఉదయ్‌పూర్ హత్య ఘటన పక్కా ‘పాక్ ఉగ్రవాద ప్రేరేపిత చర్య’ కావొచ్చంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమానాలే నిజమయ్యాయి. పదునైన కత్తితో శరీరం నుంచి తలను వేరు చేయడం ద్వారా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యాలాల్ (48)ను అత్యంత పాశవికంగా హత్యచేసిన నిందితులు మహమ్మద్ రియాజ్ అక్తారీ, గౌస్ మహమ్మద్‌కు పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాద సంస్థ ‘దావత్-ఎ-ఇస్లామీ’తో సంబంధాలున్నట్లు తేలింది. ఈ దారుణ హత్యోదంతం దిశగా ఆ ఇద్దరిని ఉసిగొల్పింది అక్కడి ఆ సంస్థ ప్రతినిధులేననీ స్పష్టమైంది. కరాచీ కేంద్రంగా ఉన్న కార్యాలయం నుంచి హంతకులకు ఫోన్లు వచ్చాయి. ‘నూపుర్ శర్మ వ్యాఖ్యలపై మేమిక్కడ నిరసన తెలిపాం. మీ ప్రతిస్పందన మాత్రం ‘‘తీవ్రంగా’’ఉండాలి.. ఆ ఘటన తాలూకు వీడియోనూ మాకు పంపాలి అని వారికి ఆదేశాలొచ్చాయి!! గౌస్‌కు అయితే దావత్-ఎ-ఇస్లామీ సంస్థతో దగ్గరి సంబంధాలున్నట్లు నిర్ధారణ జరిగింది. అతడు 2014లో పాకిస్థాన్‌కు వెళ్లి కరాచీలోని ఆ సంస్థ కార్యాలయంలో 45…
Delhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు విడివిడిగా ప్రకటనలు జారీ చేశాయి. రాష్ట్రపతి ఆమోదం మేరకు ఈ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 12 వరకు సమావేశాలు జరుగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.
ముంబై:శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra Chief Minister) అవ్వడంపై ఎన్సీపీ చీఫ్(NCP chief) శరద్ పవార్(Sharad Pawar) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని తాను ఊహించలేదని, వాస్తవానికి ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నట్లు ఆయన తెలిపారు. షిండే ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ముందు ఆయన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేకతను చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిద్యానికి, పర్యావరణ,ప్రకృతి ఆరాధనకు ప్రతీకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రపండుగైన బోనాల పండగ ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో గురువారం నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల సాంప్రదాయాలకు, రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవాన్నిస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.
Hyderabad: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా 1వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. శంషాబాద్ టౌన్‌లో కిలోమీటర్ మేర రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు నోవాటెల్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. 7గంటలకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతారు. 8.30 గంటలకు భరతనాట్యం, శివతాండవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేలకు సర్వం సిద్ధమైంది. జులై 2, 3 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda) హాజరుకానున్నారు. అయితే సమావేశాలకు సంబంధించిన వేదికలను తెలంగాణ (Telangana) ఫ్లేవర్‌ను జోడించారు. హెచ్ఐసీసీ నోవాటెల్ ప్రాంగణానికి శాతవాహన నగర్‌గా పేరు పెట్టారు. సమావేశాలు జరిగే హాల్‌కు కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేశారు. అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క-సారలమ్మ నిలయంగా పేరు ఫిక్స్ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శల సమవేశం జరిగే మీటింగ్ హాలుకు వందేమాతరం రామచంద్రరావు పేరు, మీడియా పాయింట్ కు సోయాబుల్లాఖాన్ పేరు, జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసుగా, బీజేపీ ఫుల్ టైమర్ వర్కర్స్ సమావేశానికి కొమురం భీం పేరు,…
రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై టి-హబ్ 2 భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన యూనికార్న్ స్టార్ట్‌ప్సతో ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. టిహబ్ భవనాన్ని మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం యూనికార్న్ స్టార్ట్‌పల వ్యవస్థాపకులను సన్మానించారు. అదే రోజు రాత్రి కేటీఆర్ వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలను రూపొందించామన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ప్రారంభించాయని, ఐటీ రంగంలో ప్రపంచపటంలో నగరానికి విశిష్టస్థానం ఉందన్నారు. పెట్టుబడులకు సిద్ధమైతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. లీడ్…