Author: admin

డోన్‌ (నంద్యాల): ఆకర్షణకు, ప్రేమకు మధ్య వ్యత్యాసం తెలియని వయస్సు వారిది. సినిమాల ప్రభావంతోనో, సామాజిక మాధ్యమాల్లో అతి స్పందనలతోనో.. మరే కారణంతోనో ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు పెద్దలు అడ్డుచెప్పారు. అబ్బాయికి బలవంతంగా అక్కకూతురుతో పెళ్లి చేశారు. తమ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు తెలియక మనస్తాపం చెందిన ఇద్దరు ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణగిరి మండలం అలంకొండ గ్రామానికి చెందిన బోయ మాదులు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు బోయ ప్రసాద్‌ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు. గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చాకలి రామాంజనేయులు, లింగమ్మ దంపతుల కుమార్తె అనిత (16) పదో తరగతి పూర్తి చేసింది. వీరిరువురూ రెండు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. బోయ ప్రసాద్‌కు రెండు నెలల క్రితం అతని సొంత అక్క కూతురుతో…

Read More

మైసూరు (కర్ణాటక): సీనియర్‌ నటి పవిత్ర లోకేష్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, అంతటితో ఆగకుండా తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారంటూ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫేక్‌ అకౌంట్ల ద్వారా తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఆరోపణల మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నారు. కాగా దివంగత కన్నడ నటుడు మైసూరు లోకేశ్‌ కుమార్తె పవిత్ర లోకేశ్‌. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో సౌత్‌ ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. ఇకపోతే పవిత్ర.. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేశ్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! దీనిపై అటు నరేశ్‌ కానీ, ఇటు పవిత్ర కానీ ఇంతవరకు స్పందించనేలేదు.

Read More

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రేపటి (జులై 1) నుంచి ప్రారంభంకానున్న టెస్ట్‌ మ్యాచ్‌పై ఇంగ్లండ్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ తన అంచనాలను వెల్లడించాడు. న్యూజిలాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి జోష్‌ మీద ఉన్న ఇంగ్లండ్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో ఆపడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌ గతేడాదే పూర్తై ఉంటే ఫలితం టీమిండియాకే అనుకూలంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టు లోడెడ్‌ గన్‌ను తలపిస్తుందని, దానికి ఎదురుపడిన వారు ఎంతటి వారైనా ఫైరవుతారని హెచ్చరించాడు. టీమిండియాకు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సేవలు అందుబాటులో లేకపోవడం మరింత మైనస్‌ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ మైండ్‌ సెట్‌ గతేడాదితో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు స్టోక్స్‌ టీమ్‌ ఎదురుదాడినే ప్రధాన అస్త్రంగా వినియోగిస్తుందని తెలిపాడు. అంతిమంగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టే ఫేవరెట్‌ అని జోస్యం చెప్పాడు. కాగా, గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన…

Read More

ఆస్ట్రేలియా పేసర్‌ సీన్‌ అబాట్‌ తన చిరకాల ప్రేయసి బ్రియర్‌ నీల్‌ను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల నడుమ బుధవారం(జూన్‌ 29) జరిగిన వేడుకలో ఆమెను వివాహమాడాడు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన చిన్నారి సమక్షంలో వీరి వివాహం జరుగడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీన్‌ అబాట్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేశాడు. ‘‘నా ‘ప్రేమ’ను నేను పెళ్లాడాను. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ బ్రియర్‌ అబాట్‌! స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మా జీవితంలోని ప్రత్యేక వేడుక ఇలా జరిగింది’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్‌-2022లో సీన్‌ అబాట్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి సందర్భంగా సోషల్‌ మీడియాలో అబాట్‌ దంపతులకు రైజర్స్‌ యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. కాగా అబాట్‌ 2014లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆసీస్‌ తరఫున 5 వన్డేలు,…

Read More

ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయి కొట్టిమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకపై ప్రకృతి సైతం పగబట్టింది. ఇవాళ (జూన్‌ 30) ఉదయం కురిసిన భారీ వర్షం దెబ్బకు లంకలోని చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్ష బీభత్సం ధాటికి కొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. వర్ష ప్రభావం శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌పై కూడా చూపింది.

Read More

టీమిండియాతో రేపటి (జులై 1) నుంచి ప్రారంభంకానున్న ఐదో టెస్ట్‌కు ఇంగ్లండ్‌ తుది జట్టు ఖరారైంది. ఒక్క మార్పు మినహా తాజాగా న్యూజిలాండ్‌పై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) రంగంలోకి దించుతుంది. జేమీ ఓవర్టన్‌ స్థానంలో వెటరన్‌ పేసర్‌ జిమ్మీ ఆండర్సన్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Read More

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రేపటి (జులై 1) నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సి ఉన్న రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఎవరనే అంశంపై సందిగ్ధత వీడింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. రోహిత్‌కు ఇవాళ ఉదయం జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ కోవిడ్‌ పాజిటివ్‌గానే ఉన్నందున, ఐదో టెస్ట్‌కు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ వ్యవహరిస్తాడని ఆయన పేర్కొన్నారు.

Read More

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ ఎంపికయ్యాడు. జూన్‌ 28న ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి ఇయాన్‌ మోర్గాన్‌ తప్పుకోవడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఇవాళ (జూన్‌ 30) బట్లర్‌ను కొత్త సారధిగా ప్రకటించింది. గత పదేళ్లుగా ఇంగ్లండ్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా కొనసాగుతున్న బట్లర్‌ ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్‌ నూతన కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బట్లర్‌.. ఈసీబీకి, మాజీ సారధి మోర్గాన్‌ను ధన్యవాదాలు తెలిపాడు. గత ఏడేళ్లుగా ఇంగ్లండ్‌ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించిన మోర్గాన్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. మోర్గాన్‌ నుంచి బాధ్యతలు చేపట్టడం గొప్ప గౌరవమని అన్నాడు. ఇంగ్లండ్‌ తరఫున 57 టెస్ట్‌లు, 151 వన్డేలు, 88 టీ20 ఆడిన బట్లర్‌ తొమ్మిది వేలకు పైగా పరుగులు సాధించాడు. బట్లర్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 13 సెంచరీలు, 54 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

Read More

ప్రపంచంలోనే అతిపెద్దదైన బెల్జియంలోని చాక్లెట్ ప్లాంట్‌లో సాల్మోనెల్లా బ్యాక్టీరియాను గుర్తించారు. వీజ్ పట్టణంలో ఉన్న ఈ ప్లాంట్‌ను స్విస్ దిగ్గజం బారీ కాల్‌బాట్ కంపెనీ నిర్వహిస్తోంది. మొత్తం 73 మంది క్లెయింట్స్‌కు కాన్ఫెక్షనరీల తయారీ కోసం హోల్‌సేల్‌గా ఇక్కడ లిక్విడ్ చాక్లెట్‌ను ఉత్పత్తి చేస్తారు. అయితే, బ్యాక్టీరియా బయటపడిన వెంటనే ఉత్పత్తిని నిలిపివేసినట్టు కంపెనీ అధికార ప్రతినిధి కోర్నీల్ వార్లోప్ తెలిపారు. బ్యాక్టీరియా బయటపడగానే బారీ కాల్‌బాట్ తమ కస్టమర్లతో మాట్లాడింది. తాజాగా తమ నుంచి అందుకున్న చాక్లెట్ లిక్విడ్‌తో ఎలాంటి ఉత్పత్తులు తయారుచేయొద్దని కోరింది. అంతేకాదు, తదుపరి నోటీసు వచ్చే వరకు వీజ్ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు తెలిపింది.

Read More

దేశంలోని ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్‌ సొసైటీలను (పీఏసీఎస్‌) కంప్యూటరీకరించాలని కేంద్రం నిర్ణయించింది. రానున్న ఐదేళ్లలో 63 వేల పీఏసీఎ్‌సల్లో రూ. 2516 కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయితే పాలనలో పారదర్శకత పెరిగి…రైతులకు అందించే సేవలు మరింత మెరుగుపడతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి అయ్యే మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ. 1,528 కోట్లను భరించనుంది. ఇప్పటికే కంప్యూటరీకరణ పూర్తయిన వాటికి రూ.50 వేలు రీయింబర్స్‌ చేయనుంది. కంప్యూటరీకరణ లేని కారణంగా చాలా పీఏసీఎ్‌సలు సమర్థమంతంగా పనిచేయడం లేదని, డీసీసీబీలకు, రాష్ట్ర సహకార బ్యాంకులకు అనుసంధానం అయ్యే సాఫ్ట్‌వేర్‌లు లేవని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కంప్యూటరీకరణలో భాగంగా రోజువారీ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో ఒకే ప్లాట్‌ఫామ్‌ ఉంటుందని, కామన్‌ అకౌంటింగ్‌ సిస్టమ్‌ ఉంటుందని పేర్కొంది. దాంతో త్వరగా రుణాలు…

Read More