Author: admin

న్యూయార్క్‌: మానవ హక్కుల ఉల్లంఘనలో హేయనీయమైన ఘటనలు వెలుగులోకి రావడం కొత్తేం కాదు. కానీ, ప్రపంచమంతా ఉలిక్కిపడేలా దారుణాతిదారుణాలు ఆఫ్రికన్‌ దేశం కాంగోలో చోటుచేసుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం ఓ మహిళ కథ.. అక్కడి రెబల్‌ గ్రూప్‌ల అరాచకాలను బయటపెట్టడంతో పాటు సభ్య దేశ్యాలను నివ్వెరపోయేలా చేసింది. డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో పరిస్థితులపై భద్రతా మండలిలో సాధారణ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా.. సోఫెపడి హక్కుల సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది జూలియెన్నె లుసెంగె.. తూర్పు కాంగోలో తనకు తారసపడ్డ ఓ మహిళ కథను మండలికి వినిపించగా.. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు అక్కడ నిశబ్ద వాతావరణం నెలకొంది. కాంగోలో ప్రభుత్వం, రెబెల్‌ గ్రూప్స్‌ మధ్య అంతర్యుద్ధం.. ఈ మే నెలలో తారాస్థాయికి చేరింది. ఆ పరిస్థితులు కాస్త తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ తరుణంలో.. కోడ్‌కో అనే మిలిటెంట్‌ గ్రూప్‌ ఓ కుటుంబం నుంచి ఓ మహిళను…

Read More

నాంది సినిమా సక్సెస్‌తో జోష్‌ మీదున్నాడు అల్లరి నరేశ్‌. ప్రస్తుతం అతడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా చేస్తున్నాడు. నరేశ్‌కు ఇది 59వ చిత్రం. ఈ మూవీలో ఆనంది హీరోయిన్‌. గురువారం (జూన్‌ 30న) అల్లరి నరేశ్‌ బర్త్‌డేను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. అడవిలో నివాసం ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిగా నటించాడు హీరో. సాయం సేత్తే మనిషి, దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారు, మీరు మనుషులైతే సాయం సేయండి అన్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. అసలు వారికున్న సమస్య ఏంటి? ఏ సమస్య గురించి నరేశ్‌ పోరాడుతున్నాడు? అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండ నిర్మిస్తున్నారు. ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి…

Read More

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మేజర్‌. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్‌ హీరో మేజర్ సందీప్‌ ఉన్నీకృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడివి శేష్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మేజర్‌ సందీప్‌ తల్లిదండ్రులుగా ప్రకాశ్‌ రాశ్‌, సీనియర్‌ నటి రేవతిలు కనిపించారు. శోభితా ధూళిపాళ, సయూ మంజ్రేకర్‌ హీరోయిన్లుగా నటించారు. జూన్‌ 3న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి మేజర్‌ అందుబాటులోకి రానుంది. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రసారం కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

Read More

‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్‌’ వంటి పలు తెలుగు హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది సోనాలి బింద్రె. 2013లో హిందీలో వచ్చిన వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై దొబార చిత్రంలో అతిథిగా కనిపించిన ఆమె క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని ఆరోగ్యంతో తిరిగొచ్చిన సోనాలి బింద్రె ది బ్రోకెన్‌ న్యూస్‌ అనే వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల జూన్‌ 10న ఈ వెబ్‌ సిరీస్‌ జీ5లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సోనాలి బింద్రె ఇటీవల తనపై వస్తున్న పుకార్లను ఖండించింది. సోనాలి బింద్రె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అందుకే ఆమె మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్‌ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆఫర్స్‌ కావాలంటూ దర్శక-నిర్మాతలకు ఆమె విజ్ఞప్తి చేసుకుంటుందంటూ బి-టౌన్‌లో గుసగుసలు వినిపంచాయి. తాజాగా సోనాలి…

Read More

“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మాయోన్”. ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి ‘ఏదో ఏదో ఏదో.. వెతికే నయనం.. చేతికి అందేదాకా ఆగదు పయనం” అను పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నాకు మాస్ట్రో ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అయన అభిమానినైన నేను అయన సంగీత సారధ్యంలో సత్య ప్రకాష్ ధర్మార్, శ్రీనిషా జయశీలన్ పాడిన “ఏదో ఏదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా…

Read More

కొత్త నెల కొత్త సరుకుతో సిద్ధంగా ఉంది. జూన్‌కు ముగింపు పలుకుతున్న తరుణంలో జూలై మాసం బోలెడన్ని సినిమాలతో వెల్‌కమ్‌ చెప్తోంది. అటు థియేటర్‌లోనే కాదు, ఇటు ఓటీటీలోనూ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. జూలై ఒకటో తారీఖున పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటి? అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ కానున్నాయో చూసేద్దాం.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ ద టెర్మినల్‌ లిస్ట్‌ కుంగ్‌ఫూ పాండా: ద పాస్‌ ఆఫ్‌ డెస్టినీ (రెండో సీజన్‌) నెట్‌ఫ్లిక్స్‌ రెబెల్డీ (రెండో సీజన్‌) స్ట్రేంజర్‌ థింగ్స్‌ (నాలుగో సీజన్‌ రెండో వాల్యూమ్‌) ద క్రేగ్స్‌లిస్ట్‌ కిల్లర్‌ ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌ మియా బీవీ ఔర్‌ మర్డర్‌ జీ5 ధాకడ్‌ షటప్‌ సోనా కీడం (మలయాళ మూవీ) బాపూ బహర్‌ భేజ్దే

Read More

హాట్‌స్టార్‌లో హిట్‌ అయిన వెబ్‌ సిరీస్‌లో పరంపర ఒకటి. గతేడాది రిలీజైన ఈ సిరీస్‌ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా దీనికి సీక్వెల్‌గా వస్తోంది పరంపర సీజన్‌ 2. జగపతి బాబు, శరత్‌కుమార్‌, నవీన్‌ చంద్ర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు హరి యేలేటి కథ అందించాడు. హరి యేలేటితో పాటు కృష్ణ విజయ్‌, విశ్వనాథ్‌ ఆరిగెళ్ల దర్శకత్వం వహించారు. గురువారం ఈ సిరీస్‌ నుంచి టీజర్‌ రిలీజైంది. ‘నా ఉద్దేశం నాయుడిని చంపడం కాదు సర్‌, వాడి అహాన్ని దెబ్బకొట్టాలి’ అంటూ నవీన్‌ చంద్ర చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. జూలై 21న ఈ సిరీస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Read More

సత్యసాయి జిల్లా: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆటోలో వెళ్తున్న కూలీలపై హై టెన్షన్‌ కరెంట్‌ వైర్లు తెగిపడటంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై డీఎస్పీ రమాకాంత్‌ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం ఆటోపై ఇనుప మంచం తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇనుప మంచానికి తెగిపడిన విద్యుత్‌ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొందరు ఆటో నుంచి దూకి బయటపడ్డారు. ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు మాత్రం మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించాము అని తెలిపారు. ఇదిలా ఉండగా.. విద్యుత్‌ ప్రమాద ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరినాధ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడుత…

Read More

ముంబై: రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్యోదంతంలో ఉగ్రకోణం వెలుగు చూడడంతో నిఘా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. పాక్‌ ఉగ్రవాద సంస్థలతో నిందితులకు సంబంధం ఉన్నట్లు తేలడంతో పాటు మరికొన్ని కీలకాంశాలను సైతం రాజస్థాన్‌ పోలీసులు విచారణ ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే.. ఈ ఘటన కంటే ముందే మహారాష్ట్రలో దాదాపుగా ఇదే తరహాలో జరిగిన ఓ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో దర్యాప్తు ఊపందుకుంది. మహారాష్ట్ర అమరావతిలో మెడికల్‌ సామాగ్రి వ్యాపారి ఉమేష్‌ కోల్హే హత్య పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఆయన్ని కూడా కన్హయ్య లాల్‌ తరహాలోనే దుండగులు గొంతుకోసి హతమార్చారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇతర వివరాలేవీ బయటకు పొక్కనివ్వడం లేదు. అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం.. ఇది నూపుర్‌ శర్మ కామెంట్లకు ముడిపడిన ఘటనే అని చెప్తున్నారు. జూన్‌ 21వ తేదీ రాత్రి దుకాణం నుంచి…

Read More

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసి క్యూబా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను చూపిస్తూ అందులో పెట్టుబడుల పేరుతో అనేక మంది నుంచి రూ. 13 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో తల్లీకుమారులను సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. క్యూబా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ నిర్వహించే నాగెల్లి రూపస్‌ ఆయన భార్య నాగెల్లి సుకన్య, కుమారుడు జసింత్‌ జీటీఎఫ్‌ఎల్‌ మినిస్ట్రీస్‌ పేరుతో చర్చిల్ని నిర్వహిస్తున్నారు. అక్కడకు వచ్చిన వారిని నమ్మించిన ఈ త్రయం వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేశారు. 2017–18ల్లో దాదాపు 30 మంది నుంచి రూ.13 కోట్ల వరకు తీసుకున్నారు. తమ డబ్బు ఇవ్వమని అడిగిన వారిని బెదిరించడం వారిపైనే కేసులు పెట్టడం చేస్తున్నారు. వీరికి రూ.కోటి వరకు ఇచ్చి మోసపోయిన కేవీ ప్రసాద్‌ అనే బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని…

Read More