Author: admin

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ.. బ్రెజ్జా కొత్త వెర్షన్‌ కారును మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ప్రారంభ రూ.7.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌).కొత్త బ్రెజ్జాతో ఎస్‌యూవీ విభాగంలో తాము మరింత పటిష్ఠం అవుతామని కంపెనీ తెలిపింది. ఈ రెండో తరం బ్రెజ్జా మార్కెట్లో టాటా నెక్సాన్‌, హ్యుండయ్‌ వెన్యూ, కియా సోనెట్‌తో పోటీ పడనుంది. కొత్త బ్రెజ్జా మాన్యువల్‌, ఆటోమేటిక్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. గత 8 నెలల కాలంలో తాము విడుదల చేసిన ఆరో కారు ఇదని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హిసాషి టకయుచి చెప్పారు. కొత్తతరం కే సీరీస్‌ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారు లీటరు పెట్రోల్‌కు 20.15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. రెండు కొత్త వెర్షన్లలోనూ 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, ఎలక్ర్టిక్‌ సన్‌రూఫ్‌, డిజిటల్‌ 360 కెమెరా, 40 కనెక్టెడ్‌ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ వంటి ప్రత్యేకతలున్నాయి.

Read More

ముంబై : crypto currencyలు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని Reserve Bank of India(RBI) వ్యాఖ్యానించింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు(గురువారం) తీవ్రంగా విరుచుకుపడ్డారు. క్రిప్టో ఆస్తులు మొత్తం ప్రపంచ ఆర్థిక ఆస్తులలో చిన్న భాగమని RBI ఎత్తిచూపింది. ‘హోరిజోన్‌లో ఉద్భవిస్తున్న ప్రమాదాలను మేము గుర్తుంచుకోవాలి. క్రిప్టోకరెన్సీలు స్పష్టమైన ప్రమాదం’ అని పేర్కొన్న శక్తికాంత దాస్… క్రిప్టోకరెన్సీలు ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అంటూ మరోమారు హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు క్రిప్టో ఆస్తుల వల్ల కలిగే నష్టాలకు వ్యతిరేకంగా RBI అధికారులు జారీ చేసిన హెచ్చరికల్లో ఇది కూడా ఒకటి. ఆర్థికవ్యవస్థ ఎక్కువగా డిజిటలైజ్ అవుతున్నందున, సైబర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో… ప్రత్యేక శ్రద్ధ అవసరమని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాగా… FSR ప్రస్తుతం క్రిప్టో ఆస్తుల నుండి ఆర్థికస్థిరత్వం వరకు నష్టాలు పరిమితంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి, మొత్తం పరిమాణం ప్రపంచ ఆర్థిక ఆస్తులలో కేవలం 0.4% మాత్రమే…

Read More

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు పెద్ద పెద్ద ఒరిజినల్‌ ఎక్వి్‌పమెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ (ఓఈఎం), ఆటో సరఫరాదారులు, టెక్నాలజీ కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్‌ ఆపరేటర్లతో కలిసి పని చేస్తున్నామని, వాటితో చర్చిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఇది దేశంలోనే సమగ్ర మొబిలిటీ ఎకోసిస్టమ్‌ అవుతుందన్నారు. మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాలను జులై 6న వెల్లడించనున్నట్లు చెప్పారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ)పై నాస్కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌) నిర్వహించిన సదస్సులో కేటీఆర్‌ మాట్లాడారు. వికారాబాద్‌ జిల్లాతో సహా రెండు ప్రదేశాలను వ్యాలీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఇటీవల కార్ల కంపెనీ హ్యుండయ్‌ ప్రకటించింది. మొబిలిటీ వ్యాలీలో హ్యుండయ్‌ యాంకర్‌ ఇన్వెస్టర్‌ అయ్యే వీలుంది. వ్యాలీలో టెస్ట్‌ ట్రాక్‌లు,…

Read More

రూ.14 లక్షల కోట్లు హాంఫట్‌ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు జూన్‌  నెల  ఏ మాత్రం కలిసి రాలేదు. మే నెలతో  పోలిస్తే జూన్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 4.5 శాతం (దాదాపు 2,500 పాయింట్లు) నష్టపోయింది. దీంతో బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) రూ.14 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.243.65 లక్షల కోట్లకు చేరింది. అమ్మకాల హోరుతో గత నెల ఒక దశలో సెన్సెక్స్‌ 50,921.22 పాయింట్లకు చేరి 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది. గత మూడు నెలల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ 9.5 శాతం నష్టపోయాయి. 2020 మార్చి తర్వాత ఒక  త్రైమాసికంలో ప్రధాన సూచీలు ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చూసినా సెన్సెక్స్‌ 8.96 శాతం, నిఫ్టీ 9.01 శాతం నష్టపోయాయి. ఈ ఏడాది జనవరి 17న నమోదైన ఆల్‌టైమ్‌ హైతో పోలిస్తే మాత్రం గురువారంతో ముగిసిన జూన్‌లో…

Read More

ముంబై:బిట్‌ కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలను స్పష్టమైన అపాయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభివర్ణించారు. అంతర్లీనంగా ఏ విలువ లేకుండా, కేవలం నమ్మకం ద్వారా అధునాతన విధానంతో విలువను పొందే ఊహాగానం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ‘‘ఆర్థిక సేవల వ్యవస్థలో డిజిటలీకరణ క్రమంగా పెరుగుతున్న తరుణంలో సైబర్‌ దాడుల ముప్పు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టి అవసరమ’’న్నారు. ఆర్‌బీఐ గురువారం విడుదల చేసిన 25వ  ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎ్‌ఫఎ్‌సఆర్‌) ముందుమాటలో దాస్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సంబంధిత వర్గాలు, సంస్థల నుంచి ఇప్పటికే సమాచారం సేకరించిన ప్రభుత్వం.. క్రిప్టోకరెన్సీలపై చర్చా పత్రాన్ని ఖరారు చేసే ప్రక్రియలో ఉంది. విలువపరంగా తీవ్ర ఊగిసలాటలకు లోనవుతున్న ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలపై ఆర్‌బీఐ ముందు నుంచీ ప్రజలను హెచ్చరిస్తూనే వస్తోంది. వాటితో ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికీ భంగం కలుగవచ్చనీ పలు సందర్భాల్లో ఆర్‌బీఐ గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ…

Read More

న్యూఢిల్లీ:  దేశంలో వాణిజ్య వంట గ్యాస్ ధర శుక్రవారం తగ్గింది. జులై 1వ తేదీ శుక్రవారం నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.198 తగ్గింది. దేశ రాజధానిలో శుక్రవారం వాణిజ్య వంట గ్యాస్ ధర రూ.2021 అవుతోంది. గతంలో 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,219గా ఉంది.అంతకుముందు జూన్ 1న కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.135 తగ్గింది.ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చేలా రూ.198 తగ్గించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైలర్లు తాజా నోటిఫికేషన్‌లో తెలిపారు.కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.182 తగ్గింది. మరోవైపు ముంబైలో రూ.190.50, చెన్నైలో 187రూపాయలు తగ్గింది. పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ కూడా వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించింది. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర తగ్గ లేదు.

Read More

మాడ్రిడ్‌ (స్పెయిన్‌): నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గజేషన్‌ (నాటో) సభ్య దేశాల శాంతిభద్రతలకు రష్యా నేరుగా ముప్పుగా పరిణమించిందని అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వెలిబుచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద భద్రతా ముప్పుని ఎదుర్కొంటున్నామన్నాయి. యూరప్‌లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత కుదుర్చుకున్న భద్రతాపరమైన ఒప్పందాలను రష్యా తుంగలోకి తొక్కి ఉక్రెయిన్‌పై దండెత్తిందని ధ్వజమెత్తాయి. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో బుధవారం నాటో సభ్య దేశాల వార్షిక సదస్సు జరిగింది. అనంతరం 30 దేశాల నాటో కూటమి ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు రాజకీయంగా, ఆచరణీయంగా మద్దతిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ యూరప్‌లో శాంతిని విచ్ఛిన్నం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోటెన్‌బెర్గ్‌ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో సభ్య దేశాలకు భద్రతాపరంగా పెను సవాళ్లు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలండ్‌లో శాశ్వత…

Read More

జెనీవా: కరోనా వైరస్‌.. వైద్య నిపుణులు అనుకున్నదాని కంటే మొండి ఘటంగా మారుతోంది. మహమ్మారిగా కరోనా కథ ముగిసిపోవడం లేదు. కేవలం రూపం మాత్రమే మార్చుకుంటోంది అంతే. ప్రస్తుతం 110 దేశాల్లో కేసులు వెల్లువలా పెరిగిపోతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మహమ్మారి మారుతోంది కానీ అది ముగియలేదు. #COVID19 వైరస్‌ని ట్రాక్ చేయగల మా(డబ్ల్యూహెచ్‌వో) సామర్థ్యం ముప్పు అంచుకి చేరుకుంది. ఒమిక్రాన్‌, దాని నుంచి పుట్టుకొస్తున్న వేరియెంట్లను ట్రాక్‌ చేయడం, విశ్లేషించడం చాలా కష్టతరంగా మారుతోంది. కాబట్టి ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ ప్రకటించారు. బీఏ.4, బీఏ.5.. కేసులు వెల్లువలా పెరిగిపోతున్నాయ్‌. కానీ, కొత్త వేరియెంట్ల జాడను ట్రేస్‌ చేయలేకపోతున్నాం. వాటిలో ముప్పు కలిగించే వేరియెంట్లు లేకపోలేదు. దాదాపు 110 దేశాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పెరుగుదల గతంతో పోలిస్తే.. 20…

Read More

ముంబై: మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే ఈరోజు (గురువారం) సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం.. ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు. వ్యూహం మార్చిన బీజేపీ గత పది రోజులుగా ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఉద్దవ్‌ సర్కార్‌ను కూలదోసామన్న పేరు రాకుండా జాగ్రత్త పడింది. దీంతో మహారాష్ట్ర సర్కార్‌ను బీజేపీ వెనకుండి నడిపించేందుకు సిద్ధమైంది. ఎవరూ ఊహించని విధంగా ఏక్‌నాథ్‌ షిండే ఆధ్వర్యంలో మహారాష్ట్ర సర్కార్‌ కొలువుదీరనుంది. సీఎం పదవి ఆశించలేదు ముఖ్యమంత్రి పదివిని ఏనాడు ఆశించలేదని ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. బీజేపీ పెద్ద మనసుతో…

Read More

తెలిసీ తెలియని వయసు.. తోటి చిన్నారులతో ఆడిపాడే సమయంలోనే కొండంత కష్టం వచ్చి పడింది. ఒక యుద్ధం.. ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ చేయడమే కాదు.. ఐదు దశాబ్దాల తర్వాత మానని గాయాలతో ఆమెకు నిత్య నరకం చూపిస్తోంది కూడా. వియత్నాం వార్‌ ద్వారా చరిత్రలో నిలిచిన పోయిన నాపామ్‌ గర్ల్‌ కథ(వ్యథ) ఇది.. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి.. ఇంటి పక్కన స్నేహితులతో సరదాగా ఆడుకుంటోంది. పారిపోండి.. పరిగెత్తండి అంటూ మిలిటరీ దుస్తుల్లో ఉన్న కొందరి హెచ్చరికలు వాళ్ల చెవినపడ్డాయి. అంతా కలిసి పరుగులు తీశారు. ఇంతలో వాళ్లు ఉన్న ప్రాంతంలో ఓ బాంబు పైనుంచి వచ్చి పడింది. మిగతా పిల్లలంతా ఏడుస్తూ తలోదిక్కు పారిపోతుంటే.. ఆ చిన్నారి మాత్రం దుస్తులు మంటల్లో కాలిపోయి.. బట్టల్లేకుండా రోదిస్తూ గాయాలతో రోడ్డు వెంట పరుగులు తీసింది. జూన్‌ 8, 1972.. టే నిహ్‌ ప్రావిన్స్‌ ట్రాంగ్‌ బ్యాంగ్‌ వద్ద జరిగిన…

Read More