Author: admin

ప్రయాణికులకు తప్పిన ముప్పు కామారెడ్డి,ఆగస్ట్‌13(ఆర్‌ఎన్‌ఎ): కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ ఎదుట అదుపుతప్పి బోల్తా పడిరది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడే ఉన్న హమాలీల సహాయంతో బస్సు అద్దాలను పగులకొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ఎవరికీ ప్రాణహాని జరుగక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయపడినవారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బస్సు డ్రైవర్‌కు కళ్లు తిరగడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందిన పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read More

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వరంగల్‌,ఆగస్ట్‌13(ఆర్‌ఎన్‌ఎ): భారత స్వాతంత్య ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయాలని, ఆనాటి ఉద్యమ నేపథ్యం భావి తరాలకు అర్థం చేయించాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. స్వాతంత్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ పోలీస్‌ హెడ్‌ క్వాటర్స్‌ నుంచి జేఎన్‌ఎస్‌ వరకు నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు చోట్ల నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాంతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించా లన్నారు. ఈ నెల 16న సామూహిక స్వాతంత్య జాతీయ గీతాలోపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవాలని విజయవంతం చేయాలన్నారు. గాంధీజీ ఆశయాలను మనమంతా ఆచరించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.…

Read More

సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలన్న కోదండరెడ్డి హైదరాబాద్‌,ఆగస్ట్‌13(ఆర్‌ఎన్‌ఎ): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండ రామ్‌ డిమాండ్‌ చేశారు. అసంబద్ధ విధానాల కారణంగానే కాళేశ్రం ముంపుకు గురయ్యిందన్నారు. దీనికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. జల విషాదాల అసమర్థ పాలకులపై రణ దీక్ష’ పేరుతో టీజేస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షకు దిగారు. భారీ నష్టాలకు కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని..వరద బాధితులకు న్యాయ సమ్మతమైన నష్టపరిహారం చెల్లించాలనే డిమాండుతో పార్టీ నాయకులతో కలసి దీక్ష చేపట్టారు. గత జులై నెలలో వచ్చిన వరదల కారణంగా పంట నష్టం భారీగా జరిగిందని, వరద బీభత్సంతో ప్రజలు సర్వం కోల్పాయారని ఈ సందర్భంగా కోదండరామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం న్యాయ సమ్మతమైన పరిహారం ఇవ్వాలని కోరారు. వరదలతో భద్రాచలం నీట మునిగితే తూతూ మంత్రంగానే…

Read More

ఆతిథ్యం ఇచ్చి ఆత్మీయంగా పలకరించిన మోడీ దేశం గర్వించేలా కీర్తి తెచ్చారని కితాబు న్యూఢల్లీి,ఆగస్ట్‌13(ఆర్‌ఎన్‌ఎ): కామన్వెల్త్‌ క్రీడల పతక విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు చారిత్రక ప్రదర్శన చేసి దేశం గర్వించేలా చేశారని పేర్కొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు ప్రధాని మోడీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారితో కలిసి ముచ్చటించారు. ఇటీవలే కామన్వెల్త్‌ క్రీడలు 2022 ఘనంగా ముగిశాయి.ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల పతక విజేతలకు.. ప్రధాని నరేంద్రమోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ’కుటుంబసభ్యుల్లా విూరంతా ఇక్కడి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ముందుగా కామన్వెల్త్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ, మెడల్స్‌ సాధించినవారికి నా అభినందనలు అన్నారు. విూరంతా చారిత్రక ప్రదర్శన చేశారు. నాతో సహా దేశం మొత్తం గర్వపడేలా చేశారు. ఆత్మవిశ్వాసం, ధైర్యమే విూ గుర్తింపు. విూ…

Read More

అద్దంఇక దయాకర్ను పార్టీనుంచి సాగనంపాల్సిందే మరోమారు స్పష్టం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): రేవంత్ క్షమాపణ అంగీకరించేది లేదని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. అద్దంకి దయాకర్ ను శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాతే క్షమాపణల గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పడం సంతోషమేనని తెలిపారు. రేవంత్ రెడ్డి క్షమాపణ గురించి విూడియా ద్వారానే తెలిసిందన్నారు. ఉద్యమకారుడినైన నన్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించిందని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేస్తేనే… మునుగోడులో ప్రచారానికి వెళ్తానని తెలిపారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమాషా అనిపిస్తుందా.. చిన్న పిల్లాడిలా మాట్లాడారని చెప్పారు. సారీ చెప్తే సరిపోదని కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోవైపు మునుగోడులో ప్రచారానికి తనకు…

Read More

సోదరభావంతో పార్టీ కోసం పనిచేయండి వేడుకున్న అద్దంకి దయాకర్ హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మరోసారి క్షమాపణలు చెప్పారు. చండూరు సభలో తాను చేసిన వాఖ్యలకు భాదపడుతున్నట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఔన్నత్యంతో తన తరుపున క్షమాపణ చెప్పారన్నారు. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని అద్దంకి దయాకర్ కోరారు. కాగా… కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్లో రేవంత్ క్షమాపణ వీడియోను పోస్ట్ చేశారు. చుండూరులో జరిగిన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బహిరంగంగా తిట్టడంపై బాధ్యత వహిస్తూ ఎంపీకి రేవంత్ క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష… ఎవరికీ మంచిది కాదని, దీనిని మరోసారి క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని చిన్నారెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచించారు.

Read More

హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ రేవంత్ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. హోంగార్డు ప్రస్తావన, చండూరు సభలో వ్యాఖ్యలపై కోమటిరెడ్డికి క్షమాపణ చెబుతున్నట్లు రేవంత్ తన వీడియోలో పేర్కొన్నారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని రేవంత్ అన్నారు.చండూరు సభలో తనను అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకు మునుగోడుకు దూరంగా ఉంటానని ఎంపీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల మధ్య రేవంత్ ఓ మెట్టు దిగి కోమటిరెడ్డికి క్షమాపణలు చెప్పారు. మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, మునుగోడు బహిరంగ సభలో…

Read More

ముంబై,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): రుణ వసూళ్ల ఏజెంట్ల ఆగడాలకు చెక్ పడనుంది. దీనికి సంబంధించి ఆర్బీఐ మరోమారు మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఘాటుగా హెచ్చరించారు కూడా. తాజాగా ఏజెంట్ల ఆగడాలకు బ్యాంకులు, ఆయా ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రుణ వసూళ్ల ఆగడాలు మితివిూరి పోతున్నాయని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ఫిన్టెక్ కంపెనీలు యాప్ల ద్వారా వారికి అప్పులిచ్చి, ఏజెంట్ల సాయంతో పెద్ద ఎత్తున ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిన్టెక్ కంపెనీల్లో కొన్ని చైనా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ద్రవ్య, పరపతి విధాన సవిూక్షలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ఏజెంట్ల ఆగడాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏజెంట్లకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసింది.…

Read More

మోడీ తీరును ఎండగడుతున్న పార్టీలు దీనికి సమాధానం చెప్పాలంటూ నిలదీత న్యూఢల్లీి,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): ఉచితాల సంస్కృతి దేశానికి ప్రమాదమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడి మొదలయ్యింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు గట్టిగానే మోడీ విధానాలను తూర్పార బడుతున్నారు. పేదలను ఆదుకోవడం తమ విధానమైతే కార్పోరేట్ గద్దలకు దోచి పెట్టడం మోడీ విధానమని దుయ్యబడుతున్నారు. లక్షల కోట్ల రుణాలు మాఫీచేయడం, బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన వారిని వదిలి పెట్టడంపై వరుసగా విమర్శలకు దిగుతున్నారు. ఇది ఓ రకంగామోడీ విధానాలకు ఎదురవుతున్న సవాల్గానే పరిగణించాలి. ఈ క్రమంలో తెలంగాన సిఎం కెసిఆర్ ఇప్పటికే లెక్కలతో సవాల్ చేశారు. పెన్షన్లు ఇవ్వడం, ఆదుకోవడం ఉచితం ఎలా అవుతుందని నిలదీసారు. అలాగే ఢల్లీి సిఎం, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ కూడా ఇదే తరహా విమర్శలు గుప్పించారు. ఉచితాలపై చర్చ చేద్దామని సవాల్ చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండిపడిరది. కార్పొరేట్ సంస్థలు…

Read More

మూడు పార్టీలకు ప్రతిష్టగా మారిన ఉప ఎన్నిక టిఆర్ఎస్ గెలిస్తేనే జాతీయ రాజకీయాల్లో కెసిఆర్కు పట్టు బిజెపి గెలిస్తే తెలంగాణపై మరింత ఫోకస్ కాంగ్రెస్ గెలిస్తేనే రేవంత్కు భవిష్యత్ హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): అధికారపక్షంతో పాటు విపక్ష పార్టీలకు మునుగోడు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికలో గెలిచిన వారే రేపటి సార్తిక్ర ఎన్నికలకు హాట్ ఫేవరేట్ కానున్నారు. ఈ ఉప ఎన్నికగెలవడంద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకున్న వ్యక్తిగత సత్తాను చాటాల్సి ఉంది. ప్రజలంతా తమవైపే అంటున్న ఆయనకు వ్యక్తిగతంగా ఇది ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. ఇదే సదర్భంలో తెలంగాణ లో అధికారంలోకి వస్తామని పదేపదే ప్రకటిస్తున్న బిజెపికి కూడా ఇదో అగ్ని పరీక్షే. ఇక్కడ గెలిస్తేనే బిజెపి గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఇకపోతే అధికార టిఆర్ఎస్ పార్టీకి,ముఖ్యంగా కెసిఆర్కు ఇక్కడ గెలవడం ఎంతో అవసరం. జాతీయ రాజకీయాలపై పోకస్ పెట్టిన ఆయన మునుగోడులో గెలిస్తేనే బిజెపికి సవాల్ విసిరే అవకాశం ఉంది.…

Read More