Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!
Author: admin
Cool Drinks in Periods: పీరియడ్స్‌లో క్రేవింగ్స్ అని అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. ANDHRAPATRIKA : – – ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు.. పీరియడ్స్ సమయంలో కూడా కొంత మంది లేడీస్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. స్పైసీ ఫుడ్స్ తినాలని.. స్వీట్స్ తినాలని.. కాఫీ, టీలు తాగాలని.. ఫాస్ట్ ఫుడ్ తినాలని.. కూల్ డ్రింక్స్ తాగాలని ఇలా చాలా రకాలుగా అనిపిస్తుంది. తినాలనిపిస్తే ఆగుతారా.. వెంటనే తెచ్చుకుని తింటూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత క్రేవింగ్స్ ఉన్నా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకే ట్రై చేయాలి. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. అనవసరమైన ఆహారాలు తింటే తిప్పలు తప్పవు. అలా నెలసరి సమయంలో క్రేవింగ్స్ ఉన్నాయని కూల్ డ్రింక్స్ అదే పనిగా తాగితే.. ప్రాణాల మీదకు వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీరియడ్స్ టైమ్‌లో కూల్ డ్రింక్స్ తాగితే ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.…
Selfie with Elephant: అడవి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నం.. ఆగ్రహించిన గజరాజు కసపిస తొక్కి చంపేసింది! ANDHRAPATRIKA : – – పూణె : అడవిలోకి కేబుల్ వర్క్ కోసమని ముగ్గురు కూలీలు వెళ్లారు. అయితే అక్కడ వారికి ఓ వైల్డ్ ఏనుగు కనిపించడంతో దానితో సెల్ఫీ దిగేందుకు యత్నించారు. కానీ ఏనుగు రియాక్షన్ వాళ్లస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా అది వారిపై దాడిచేసింది. ఓ క్రమంలో ఓ వ్యక్తిని తొక్కి చంపింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని అబాపూర్ అడవుల్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్ రామచంద్ర సాత్రే (23) తన ఇద్దరు స్నేహితులతో కలిసి నవేగావ్ నుంచి గడ్చిరోలి జిల్లాలో కేబుల్ లేయింగ్ పని కోసం వచ్చారు. అయితే వారు ముట్నూర్ అటవీ ప్రాంతంలోని అబాపూర్ అటవీప్రాంతంలో ఏనుగులను చూడాలని అనుకున్నారు. గతంలో అక్కడ పలుమార్లు ఏనుగులు…
Tesla Car: టెస్లా కారులో చెలరేగిన మంటలు.. నలుగురు భారతీయులు సజీవ దహనం! ఎక్కడంటే ANDHRAPATRIKA : – – కెనడాలోని టొరంటో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్‌లోని గోద్రాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి కారణమైన టెస్లా కారు సెల్ఫ్ డ్రైవింగ్ కారా? కాదా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అసలేం జరిగిందంటే.. గోద్రాకు చెందిన కేతా గోహిల్ (30), నిల్ గోహిల్ (26), మరో ఇద్దరు వ్యక్తులతో టెస్లా కారులో గురువారం అర్ధరాత్రి ప్రయాణిస్తున్నారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారు టొరంటో సమీపంలోకి రాగానే డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం కారులో ఒక్కసారిగా మంటలు…
Shamshabad-Vizag train route: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై 4 గంటల్లోనే శంషాబాద్ టూ విశాఖపట్నం.. రయ్‌మని దూసుకపోయే రూట్ ఇదే! ANDHRAPATRIKA : – – శంషాబాద్-విశాఖపట్నం సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది. ఇది సూర్యాపేట, విజయవాడ నుంచి వెళ్లనుంది. అలాగే కర్నూల్‌లో మరో కారిడార్ నిర్మించబోతున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైల్ విశాఖ నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలు చేరుతుంది. దీని కోసం నిర్వహించిన పెట్( ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్) సర్వే చివరికి దశకు చేరింది. ఈ తుది దశకు చేరుకున్న సర్వే రిపోర్ట్‌ను నవంబరులో రైల్వే బోర్డుకు సమర్పించనన్నట్లు తెలుస్తుంది. సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో రెండు విమానాశ్రయాలు శంషాబాద్, రాజమహేంద్రవరం లకు అనుసంధానించేలా ఈ ఎలైన్‌మెంట్ ఏర్పాటు చేయడం మంచి విషయం. గంటకు 220 కి.మీ. వేగంతో వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయితే…
IND vs NZ: సొంత గడ్డపై దీనస్థితిలో భారత జట్టు.. 12 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్‌లో ఇలా ANDHRAPATRIKA : – – IND vs NZ 2nd Test: టీమిండియా 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. పుణె వేదికగా జరుగుతున్న ‘డూ ఆర్ డై’ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పుణె టర్నింగ్ పిచ్‌పై భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 156 పరుగులకు కుదించింది. టీమిండియా తరపున రవీంద్ర జడేజా అత్యధికంగా 38 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరపున మిచెల్ సాంట్నర్ అత్యధికంగా 7 వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ 2 వికెట్లు, టిమ్ సౌథీ 1 వికెట్ తీశారు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 259 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా…
Bomb Threats: బెంబెలేత్తిస్తున్న బాంబు బెదిరింపులు..వార్నింగ్ ఇచ్చినా ఆగట్లే.. ANDHRAPATRIKA : – – గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు, కేంద్రపాలిత సంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌కు సైతం గత వారం రోజుల వ్యవధిలో అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. కొద్ది రోజుల క్రితం హకీంపేట్‌లో ఉన్న సీఆర్పిఎఫ్ క్యాంపుకు సైతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో జవహర్ నగర్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఇక తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు శుక్రవారం సైతం మరొక బాంబు బెదిరింపు అలర్ట్ వచ్చింది. గడచిన వారం రోజుల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో బాంబు బెదిరింపు అలర్ట్‌తో పోలీసులు 5 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అక్టోబర్ 19 నుండి మొదలైన బాంబు అలర్ట్ కంటిన్యూస్‌గా ఐదు రోజులపాటు అలర్ట్ వచ్చింది. అయితే ఈ బెదిరింపులు అన్ని సోషల్ మీడియా…
Telangana: ‘ఇంటికి వెళ్తే నాన్న కొడుతున్నాడు.. నేను వెళ్లను’.. స్కూళ్లోనే దాక్కున్న చిన్నారి! ANDHRAPATRIKA : – – సాధారణంగా పిల్లలకు నాన్నే రోల్ మోడల్. ముఖ్యంగా ఆడ పిల్లలకు అమ్మతో కంటే నాన్ననే ఎక్కువగా అనుబంధం ఉంటుంది. వారికి తండ్రే తొలి హీరో అతనితోనే వారికి ఎక్కువగా సాన్నిహిత్యం ఉంటుంది. కానీ ఈ బాలిక మాత్రం తండ్రి పేరు చెబితేనే.. వణికిపోతోంది. ఇంటికి వెళ్ళేదీ లేదంటూ మారాం చేస్తోంది. ఆ బాలికకు ఏమైంది..? తండ్రిని చూసి ఎందుకు భయపడుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! హైదరాబాద్ పాతబస్తీ బాబానగర్‌కు చెందిన అక్బర్ దంపతులు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగడ్డలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త, కూతురుని వదిలి తన కుమారుడితో కలిసి తల్లి గారింటికి వెళ్ళిపోయింది భార్య. కూతురు స్థానిక ప్రాధమిక పాఠశాలలో…
PM Modi: మోదీ నిర్ణయాలు అద్భతం.. ప్రశంసలతో ముంచెత్తిన ‘కెనడాస్ వారెన్ బఫెట్’ ప్రేమ్ వాట్సా ANDHRAPATRIKA : – – వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ పెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలపై ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ‘కెనడాస్ వారెన్ బఫెట్’గా పేరు తెచ్చుకున్న, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ CEO ప్రేమ్ వాట్సా ప్రధాని మోదీని అభినందించారు. భారతదేశం రెండంకెల ఆర్థిక వృద్ధిని సాధించగల సామర్థ్యంపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇది అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జన్మించిన ప్రేమ్ వాట్సా, ఇప్పుడు టొరంటోలో 97 బిలియన్ డాలర్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. దక్షిణ కొరియా, జపాన్, చైనా వంటి దేశాలు చాలా కాలం పాటు ఈ ఘనతను సాధించాయని ఆయన గుర్తు చేశారు. ఇటీవల…
Airports: కొత్త శిఖరాలకు భారత విమానయాన రంగం! ఐదేళ్లలో మరో 50 కొత్త విమానాశ్రయాలు! ANDHRAPATRIKA : – – దేశంలోని విమానాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు ఉద్యోగాల కల్పనను పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్లలో 50 అదనపు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం (అక్టోబర్ 24) ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోందని చెప్పారు. రానున్న 20 ఏళ్లలో ఈ సంఖ్య 200 అదనపు విమానాశ్రయాలకు పెరుగుతుందని అంచనా వేశారు. రాబోయే కాలంలో 50 అదనపు విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానాశ్రయ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, ఈ నిర్ణయం ఉపాధి కల్పనను కూడా పెంచుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య…
Byreddy Sabhari: నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి అరుదైన గౌరవం.. ఏంటో తెలుసా? ANDHRAPATRIKA :- నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరికి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి సమావేశాలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరికి ఈ అరుదైన అవకాశం దక్కడంతో బైరెడ్డి అభిమానులు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూన్నారు. వచ్చే నవంబర్ నెలలో 18వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలు అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో జరగనున్నాయి. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా మాట్లాడేందుకు అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా…