Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!
Author: admin
Health: రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగేయండి.. లాభాలు ఎలా ఉంటాయంటే.. ANDHRAPATRIKA : – – -ప్రతీ ఒక్కరి వంటింట్లో కచ్చితంగా ఉండే వాటిలో జీలకర్ర ఒకటి. జీలకర్ర లేకుండా వంటను చేయరనే విషయం తెలిసిందే. జీలకర్రలో అలాంటి ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టే.. మన నిత్య జీవితంలో వీటిని ఒక భాగం చేసుకుంటాం. జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమ్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే జీలకర్రను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. * డయాబెటిస్ బాధితులకు ఈ నీరు దివ్యౌషధంగా చెప్పాలి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచడంలో…
Andhra Pradesh: ఆ ఊరంతా మూగ జీవాలను కత్తి పోట్లు.. ఎంటా అని ఆరా తీయగా.. ANDHRAPATRIKA : – – కర్నూలు జిల్లాలో రాత్రైతే చాలు.. మూగ జీవాలు తల్లిడిల్లిపోతున్నాయి. ఇంటి ముందు కట్టేసిన పశువులు, తెల్లాసరికల్లా రక్తమడుగులో పడి ఉంటున్నాయి. కొత్త రకం సైకోలు రాత్రి సమయంలో రెచ్చిపోతున్నారు. మనుషులే కాదు పశువులపై సైతం దాడి చేస్తున్నారు. కనిపించిన ఆవులను, ఎద్దులను కత్తితో కోస్తూ పైశాచిక ఆనందం పొందాడో సైకో. దీంతో రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గోనెగండ్ల మండలం కేంద్రంలో సైకోలు వీరంగం సృష్టిస్తున్నాడు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మూగజీవులైన ఆవులు, ఎద్దులు, గొర్రెలను, కత్తులతో తీవ్రంగా పొడిచి వెళ్లిపోయారు. ఇంటి ముందు ఉన్న పశువులు ఆ కత్తిపోట్లకు తీవ్ర రక్తస్రావమవుతున్నడంతో పెద్ద ఎత్తున మూగజీవులు అర్తనాదాలు పెట్టాయి. గమనించిన పశువుల యజమానులు, రైతులు వెళ్లి వెంటనే చికిత్స కొరకు పశు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు.…
Rahul Gandhi: సామాన్య హెయిర్ సెలూన్‌కు రాహుల్ గాంధీ.. అతని మాటలు విని షాక్! ANDHRAPATRIKA : – – లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సింప్లిసిటీని చాటుకున్నారు. ఢిల్లీలోని ఓ హెయిర్ సెలూన్‌కు వెళ్లారు. బార్బర్ అజిత్‌తో మాట్లాడి అతడి సాధకబాధకాలు, కలలు, ఆశయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, అతనితో ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో, రాహుల్ సెలూన్‌లో ఒక బార్బర్‌తో మాట్లాడుతూ, షేవింగ్ చేసుకుంటూ కనిపించాడు. రాహుల్ గాంధీ ఈ వీడియోను పోస్ట్ చేసి ఏమీ మిగలలేదు అని రాశారు! అజిత్ అనే బార్బర్ ఈ సెలూన్‌ను నడుపుతున్నారు. బార్బర్ అజిత్ రాహుల్‌కు రోజంతా ఎలా పనిచేస్తాడో చెప్పాడు. నెలకు 15వేలు సంపాదిస్తున్నానని రాహుల్ గాంధీకి బార్బర్ అజిత్ చెప్పాడు. ఒక వ్యక్తి 15,000ల్లో ఏం ఆదా…
డీఈవోగా రామారావు బాధ్యతల స్వీకరణ. మచిలీపట్నం అక్టోబర్ 26 ఆంధ్ర పత్రిక. కృష్ణాజిల్లా నూతన డీఈవోగా పి వి జె రామారావు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా డీఈఓ గా వ్యవహరించిన తాహెరా సుల్తానా కి వీడ్కోలు పలికారు. స్థానిక రామానాయుడుపేట వద్ద ఉన్న విశ్వకర్మ భవనంలో డీఈఓ తాహెరా సుల్తానా కు వీడ్కోలు కార్యక్రమం, నూతన డిఈఓ పివిజే రామారావుకు ఆత్మీయ ఆహ్వాన కార్యక్రమం జిల్లా విద్యా కుటుంబం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త డిఈఓ కు సమస్యల స్వాగతం : ఎన్నాళ్ళనుండో అపరిష్కృతంగా ఉన్న ఫారిన్ సర్వీసు పేరిట, డిప్యూటేషన్ల పేరిట డీఈఓ, ఉప విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష తదితర కార్యాలయాల్లో అనధి కారికంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను బడిబాట పట్టించాల ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇన్నాళ్లు కార్యాలయంలో ఏకపక్షపాలనగా జరిగిన పరిపాలనను సంస్కరించాలని, కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సీట్లు మార్పిడి…
ఇది కదా అద్దిరిపోయే గుడ్ న్యూస్ అంటే.. ఇకపై అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లాలంటే.. ANDHRAPATRIKA : – – ఏటా ఎన్నో కఠిన నియమ, నిష్టల మధ్య అయ్యప్ప దీక్షలు చేపట్టే లక్షలాది మంది భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త తెలిపింది. ఎంతో పవిత్రంగా భావించే పవిత్ర ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్‌లోనే ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. భక్తుల వినతులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు సడలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. దీనికి అనుగుణంగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డీజీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. భద్రతా కారణాల రీత్యా విమానాల్లోకి కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని ఇన్నాళ్లూ అనుమతించడం లేదు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్ళటానికి రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలను…
Big Change: నవంబర్ 1 నుంచి టెలికాం రంగంలో భారీ మార్పు.. ఇకపై మీకు నో టెన్షన్..! ANDHRAPATRIKA : – – TRAI ఇటీవల టెలికాం నిబంధనలను మార్చింది. ఫేక్, స్పామ్ కాల్స్ నిరోధించడానికి ట్రాయ్ ప్రధానంగా నిబంధనలను తీసుకువచ్చింది. ట్రాయ్ చేసిన కొత్త మార్పులు నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. అందుకే మీరు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి ఏదైనా ఆపరేటర్‌కు కస్టమర్ అయితే అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.మెసేజ్ ట్రాకింగ్‌ను అమలు చేయాలని ఇటీవల ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నవంబర్ 1వ తేదీని నిర్ణయించింది. కొత్త టెలికాం నిబంధనలు అమల్లోకి రానున్నాయి.మెసేజ్ డిటెక్షన్ అంటే.. మొబైల్ ఫోన్‌ల నుండి వచ్చే అన్ని ఫేక్ కాల్స్, మెసేజ్‌లను ఆపడానికి పనిచేసే సిస్టమ్ ఇది. నవంబర్ 1, 2024 నుండి మీ ఫోన్‌కి…
Vizag: విశాఖ హనీ ట్రాప్ కేసులో ట్విస్టు.. పదుల సంఖ్యలో జమీమా బాధితులు ANDHRAPATRIKA : – – హనీ ట్రాప్ కేసులో జాయ్ జమీమా కథలు ఒక్కోటిగా బయటికొస్తున్నాయి. పదుల సంఖ్యలో బాధితులను మోసం చేసింది జమీమా. సోషల్ మీడియా వేదికగా యువకులకు వలపు వల విసిరి.. వారి నుంచి లక్షలకు లక్షలు లాగేసినట్లు తెలుస్తోంది. జమీమాను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు కంచెరపాలెం పోలీసులు. మొబైల్ డేటా ఆధారంగా అనేక ప్రశ్నలు వేశారు. ఆమె అకౌంట్స్‌లోకి జరిగిన ట్రాన్సాక్షన్లపైనా కూపీ లాగారు. ఈ విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్పింది జమీమా. మురళీనగర్‌లోని ఇంట్లో ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. జాయ్ జమీమా మొత్తం మూడు ఫోన్లు వాడినట్లు నిర్ధారించారు పోలీసులు. వాటిలో ఓ ఫోన్ మిస్సింగ్. యాపిల్ లాప్‌టాప్ కూడా మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు…
భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూసే ఛాన్స్.. ఎక్కడో తెలుసా? ANDHRAPATRIKA : – – భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు.. లేజర్ షో..ఎక్కడో తెలుసా..! అస్సలు మిస్ చేయకండి..లేజర్ షో ఎక్కడో తెలుసా..!అది 1971 వ సంవత్సరం..భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం.. యుద్ధ వీరుల సాహసాలు.. అంటే చరిత్ర.. విశాఖ నగర ఘనత.. అన్ని మీ కళ్ళ ముందుకు.. అది కూడా సుందర సాగర తీరంలో.. ఆ ప్రదర్శన కూడా ఎక్కడో కాదు.. భారత్ పాక్ యుద్ధం విజయానికి ప్రతికగా బీచ్ రోడ్లో నిర్మించిన విక్టరీ ఎట్ సీ స్తూపం పైన లేజర్ షో నిర్వహించనున్నారు. జీవీఎంసీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అక్టోబర్ 27 ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి బీచ్ రోడ్డులో వైఎంసీఎ సమీపాన గల ” విక్టరీ ఎట్ సీ ” స్థూపంపై సౌండ్ అండ్ లేజర్ షో వేస్తున్నారు.…
కళ్యాణ మండపం నుంచి అదృశ్యమైన వధువు.. ఎక్కడ ప్రత్యక్షమైందో తెలుసా? ANDHRAPATRIKA : – – కర్నూలు జిల్లాలో కొన్ని గంటలనే పెళ్లి ఉండగా ప్రియుడితో కలిసి వధువు వెళ్లిపోయిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలలో పెళ్లి పెట్టుకొని పత్తికొండ గోపాల్ ప్లాజా నుండి వెళ్లిన పెళ్లి కుమార్తె పత్తికొండ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. తమ కుటుంబ సబ్యులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో కళ్యాణమండపం నుండి వెళ్లిపోయానని, పెళ్లికుమారుడితోొ తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, అందుకే తనకు నచ్చిన అబ్బాయితో వెళ్లానని ఆమె పోలీసులకు తెలిపింది. తమ పై తండ్రి నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఆమె పోలీసులను కొరింది. పోలీసులు తన తండ్రిని తీసుకొని వస్తే ఫిర్యాదు వెనుక తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వెళ్ళిపోయింది. కొన్ని గంటలలో పెళ్లి పెట్టుకుని కల్యాణ మండపం నుండి…
లంచం కోసం చూస్తే.. అసలుకే ఎసరు వచ్చింది ANDHRAPATRIKA : – – గంజాయి నిర్మూలించి స్మగ్లర్ల భరతం పట్టాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే.. కొంతమంది అవినీతి అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు. బాధ్యతలు మరచి.. లంచం కోసం చేయి చేస్తున్నారు. కేసు పెట్టకుండా ఉండాలంటే లక్ష ఇవ్వాల్సిందే.. లేకుంటే తీవ్రమైన కేసుల్లో ఇరుక్కోవాల్సిందే అని బేరం మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ఘటన అల్లూరి జిల్లాలో ఘటన చోటుచేసుకుంది. లంచగొండి అవినీతి అధికారి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. ఎస్పీ నివేదికతో డీఐజీ యాక్షన్ అప్లై చేశారు. ఆ అవినీతి ఎస్ఐను సస్పెండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు పోలీస్‌స్టేషన్‌లోని ఎస్‌ఐ కె.రామకృష్ణ గంజాయి వ్యాపారులతో సహకరిస్తున్నందుకు సస్పెన్షన్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూలై 4న 20 కేజీల గంజాయితో పాటు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఎస్ఐ రామకృష్ణ.. స్మగ్లర్లతో బేరాలు మొదలు పెట్టాడు. లంచం…