మెల్‌బోర్న్, ఫిబ్రవరి 4 : పొట్టి క్రికెట్‌లో ఆస్టేల్రియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ ఫార్మాట్‌లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. 211 మ్యాచుల్లోనే అతను ఈ ఘనత సాధించడం విశేషం. అప్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రికార్డును ఆండ్రూ టై బ్రేక్ చేశాడు. రషీద్ 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బాజ్‌లేను ఔట్ చేసి 300 వికెట్ సాధించాడు. పొట్టి క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 222 మ్యాచుల్లో 300 వికెట్లు తీశాడు. 2020లో రషీద్ ఖాన్, మలింగ రికార్డును బ్రేక్ చేశాడు. సీపీఎల్ టోర్నీలో బార్బడోస్ ట్రిడెంట్‌కు ఆడిన అతను సెయింట్ లూసియా జౌక్స్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని ఔట్ చేయడంతో 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు. బిగ్‌బాష్ లీగ్‌లో ఆండ్రూ టై అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో అతను 26 వికెట్లు నేలకూల్చి పెర్త్ స్కార్చెర్స్ ్గªనైల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన ్గªనైల్లో పెర్త్ స్కార్చెర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. పెర్త్ స్కార్చెర్స్ 19.2 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించింది. ఆస్టేల్రియా తరఫున 2016` 2021 మధ్య ఆండ్రూ టై 32 టీ20లు ఆడాడు. 47 వికెట్లు పడగొట్టాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!