కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరి కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో చెప్పలేని సినిమాల్లో ’కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథనే ఎంత కొత్తగా చెప్పాము అనేది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ విషయంలో వందకు వంద మార్కులు కొట్టేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమాలో రిషబ్‌శెట్టి దర్శకుడిగా ఒక మెట్టు ఎక్కితే.. నటుడిగా పది మెట్లు ఒకేసారి ఎక్కాడు. గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో ’కాంతార’ ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. గతేడాది సెప్టెంబర్‌లో భారీ అంచనాల నడుమ కన్నడలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది.ఈ సినిమాకు వస్తున్న ఆధరణతో అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడిరది. దాంతో మేకర్స్ పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉండనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. తాజాగా దీనిపై హీరో కమ్ డైరెక్టర్ రిషబ్‌శెట్టి స్పందించాడు. ఇప్పటివరకు విూరు చూసిన కాంతార పార్ట్`2 అని, మొదటి పార్ట్ వచ్చే సంవత్సరం వస్తుందని చెప్పాడు. దీంతో ప్రీక్వెల్పై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఒక పార్ట్`2, తర్వాత పార్ట్`1 రావడం బహుశా ఇదే మొదటిసారేమో. ప్రీక్వెల్‌లో రిషబ్ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎటెళ్లారు అనే అంశాలను చూపించబోతున్నట్లు టాక్. ఇందులో భాగంగానే రిషబ్ ఇటీవలే కర్ణాటకలోని కోస్టల్ ప్రాంతానికి వెళ్లాడట. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ విూదకు తీసుకెళ్లి, వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఎలాన్ చేస్తున్నారట. ఇక కాంతారకు వచ్చిన క్రేజ్‌తో ప్రీక్వెల్‌ను మరింత గ్రాండ్ స్కేల్లో రూపొందించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!