డుంబ్రిగుడ ఏప్రిల్ 3(ఆంధ్ర పత్రిక) మండలంలోని కితలంగి పంచాయితీ పరిధి వయ్యా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం దారుణం జరిగింది.స్థానికుల కథనం ప్రకారం వయ్యా గ్రామానికి చెందిన గిరిజనుడు గొల్లూరి.గోవింద్.(42) గ్రామ సమీపంలో తన ఇంటి పశువులను మేతకు తీసుకొని పోయి పశువులు మేత మేస్తుండడంతో ఎండ తీవ్రతకు చేద తీర్చుకోవడానికి చెట్టు నీడలో నిద్రిస్తుండగా అదే అదునుగా భావించి మృతుడు గ్రామానికి చెందిన కొందరు,పింపోల్ గుడ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి చెట్టు కింద నిద్రిస్తున్న గోవిందుకు అతి దారుణంగా మెడ నరికి పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేశారు.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు స్థానిక పోలీసులకు చరవాణి ద్వారా సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ హత్యకు గల కారణం గతంలో భూమి తగదాలే ఇందుకు కారణం అంటున్నారు మృతుడి కుటుంబీకులు,ఇంతటి దారుణం ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!