హైదరాబాద్: ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. చూడచక్కని ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవనంలో ఏం కష్టం వచ్చిందో ఏమో..
తండ్రి గణేష్ ఆత్మహత్యే శరణ్యమంటూ బేగంపేట్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
భార్యను, ముగ్గురు పిల్లల్లో ఒకరిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లిలో జరిగింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య, ఆత్మహత్యకు గల కారణాల్ని వెలికి తీసేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.