– దళిత నాయకులు ఈశ్వరరావు, డుంబారి రామారావు,మల్లారపు లోవ చందు
వేపాడ, పిబ్రవరి, 9 (ఆంధ్రపత్రిక) : భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని బి ఎస్ పి పార్టీ మాజీ అధ్యక్షులు, బుద్ధ జై భీమ్ వ్యవస్థాపకుడు గొల్ల ఈశ్వరరావు, పెందుర్తి వైఎస్ఆర్సిపి నాయకులు దుంబారి రామారావు, తదితరులు డిమాండ్ చేశారు. మండల కేంద్రం వేపాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గురువారం మధ్యాహ్నం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని కుమ్మపల్లి గ్రామంలో కొత్తవలస దేవరపల్లి రహదారిలోని కొమ్మపల్లి జంక్షన్ వద్ద ఆర్ అండ్ బి స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నించగా గ్రామానికి చెందిన ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, గ్రామ సర్పంచ్ నౌడు అరుణ,ఆమె భర్త నౌడు శ్రీను, జూ రెడ్డి శ్రీను,గ్రామ మహిళా వాలంటీర్ అడ్డుకున్నట్లువాళ్లు తెలిపారు. రోడ్డుని ఆనుకొని ఆర్ అండ్ బి స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం వలన వారికి ఏ విధమైనటువంటి నష్టం గానీ ఇబ్బంది గానీ లేకపోయినప్పటికీ, దళితులు అంబేద్కర్ విగ్రహం పెట్టడం జీర్ణించుకోలేకే ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి పూనుకోవడం ఘోరమ న్నారు. భారత రాజ్యాంగ నిర్మాతని అవమానపరిచిన వారిపై విగ్రహ ఏర్పాటుకు ఏర్పాటుచేసిన ఇటుకు లు, ఇసుక వంటి తదితర ముడిచరుకును ఇసిరి పారవేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టడమే కాకుండాఅధికార పార్టీకి చెందిన,ఎంపీపీ, సర్పంచ్, తదిరులపై పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి,ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించారు.జిల్లా అధికారులు తక్షణమే స్పందించి వారిపై అట్రాసిటీలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలనిడిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోఅనకాపల్లి జిల్లా అంబేద్కర్ ఆశయ సాధన సమితి కన్వీనర్ మల్లారపు లోవ చందు,దెందేటి దేముడు బాబు,కణితి విజయ్,గొల్ల శంకర్రావు,మోస వెంకటరావు, యల్లపు నగేష్,బొచ్చ దేముడు, భోగాది వరహాలు,పతివాడ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!