మచిలీపట్నం సెప్టెంబర్ 20 ఆంధ్రపత్రిక :
మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఆఫీస్ లో కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్య నారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు, బిసి నాయకులు రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్నారు.ఈ దీక్షకి మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ సంఘీభావం తెలియచేసారు.ఈ సందర్బంగా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకి ముందునుండి అండగా ఉన్నది తెలుగు దేశం పార్టీయే అని, రైతులందరు తెలుగుదేశం మద్దతుగా ఉండటం జగన్ కి నచ్చాకే చంద్రబాబుని అరెస్ట్ చేయించారాన్నారు. జైలులో చంద్రబాబు గారికి కనీసం సౌకర్యాలు కల్పించకపోవటం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ఇలాంటి నిరంకుశ ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదన్నారు. పండుగ సమయాల్లో కూడా నిరసన తెలియచేయటం ఒక్క తెలుగు దేశం కార్యకర్తలకే సాధ్యం అన్నారు. అక్రమ అరెస్టు నుండి చంద్రబాబు త్వరగా బయటకి రావాలని ప్రజలందరు ఆకాంక్షిస్తున్నరన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్, కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ తదితరులు..!