జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపం కారణంగా డేంజర్ జోన్లో చిక్కుకున్నారు.. సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుండడంతో ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తున్నాయి.
ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు విలియమ్స్. త్వరలోనే స్పేస్ నుంచి సేఫ్గా తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హీలియం లీకేజీ కారణంగా వ్యోమ నౌకలో పలు లోపాలు
భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ డేంజర్ జోన్లో చిక్కకున్నారు. కొలిగ్ బారీ బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమ నౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్.. ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ కారణంగా వ్యోమ నౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు జూన్ 6న స్టార్లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. అయితే వారి యాత్ర సజావుగా సాగకపోవడంతో ఆమె తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం అయింది. ఆమె రాక ఆలస్యం కారణంగా అనారోగ్యం ముప్పు పొంచిఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో విలియమ్స్ రాకపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై విలియమ్స్ స్పందించారు. తాము సురక్షింతగానే ఉన్నామని.. తమ ఆరోగ్యానికి ఏలాంటి డోకా లేదన్నారు. ఆలస్యంపై వివరాలు వెల్లడించారు. స్పేస్ నుంచి తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేసింది.