తెలంగాణలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. BRS 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను సోమవారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించబోతోంది. ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. BRS 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను సోమవారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించబోతోంది. ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో రంగ్ భవన్ ఆడిటోరియంలో ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించనుంది. ఈ సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషన్‌లోని కీలక అధికారులు హాజరుకానున్నారు.
2024లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్నారు. వీటిలో హిందీ బెల్ట్‌లో మూడు రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు ఉన్నాయి. దీంతో పాటు దక్షిణ భారతదేశంలోని తెలంగాణాలో కూడా ఎన్నికల పోటీ కనిపించబోతోంది. అదే సమయంలో.. ఈశాన్య భారతదేశంలోని మిజోరం కూడా ఎన్నికల కోణం నుండి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
ఏ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఎప్పుడు ముగుస్తుందంటే..
40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్‌తో ముగియనుండగా, 90 మంది సభ్యుల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ పదవీకాలం జనవరిలో ముగియనుంది. 230 మందితో మధ్యప్రదేశ్ అసెంబ్లీ, 200 మందితో రాజస్థాన్ అసెంబ్లీ, 119 మందితో తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం కూడా జనవరిలోనే ముగియనుంది. ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు వీలుగా గత రెండు నెలలుగా ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాల్లో నిరంతరం పర్యటిస్తోంది.