Asian Athletics: భారత యువ అథ్లెట్, తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం జ్యోతి.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో 13:09 లో లక్ష్యాన్ని చేరి పసిడిని..
భారత యువ అథ్లెట్, తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం జ్యోతి.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో 13:09 లో లక్ష్యాన్ని చేరి పసిడిని ముద్దాడింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి కెరీర్‌కి ఇదే తొలి మేజర్ ఇంటర్నేషనల్ గొల్డ్ మెడల్ కావడం విశేషం. గురువారం జరిగిన ఈ పోటీల్లో జ్యోతి బంగారు పతకం గెలవగా.. అజయ్ కుమార్, అబ్దుల్లా అబూబకర్ కూడా గోల్డ్ మెడల్స్ సాధించారు. దీంతో గురువారం మొత్తం 10 పోటీల్లో మూడింటిలో మనోళ్లే విజేతలుగా నిలిచారు.
పురుషుల 1500 మీ పరుగులో అజయ్ కుమార్ 3:41 నిముషాల్లో లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. అలాగే ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబకర్ 16.92 మీ లంఘించి విన్నర్‌గా భారత్‌కి బంగారు పతకం అందించాడు.
మరోవైపు మహిళల 400 మీ విభాగంలో ఐశ్వర్య మిశ్రా.. పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతాకలు సాధించడంతో.. చాంపియన్‌షిప్ రెండో రోజు భారత్ ఖాతాలో 5 పతకాలు చేరాయి.