తెలంగాణలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైంది. ప్రధాన పార్టీల సీనియర్ నేతలందరూ జనంలోకి వెళ్లి.. వాళ్ల సమస్యలను తెలుసుకుని.. పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీల సైతం ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా 3 రోజులుగా పాతబస్తీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా..
తెలంగాణలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైంది. ప్రధాన పార్టీల సీనియర్ నేతలందరూ జనంలోకి వెళ్లి.. వాళ్ల సమస్యలను తెలుసుకుని.. పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీల సైతం ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా 3 రోజులుగా పాతబస్తీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా.. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎప్పుడూ జాతీయ పార్టీల రాజకీయాలపై విమర్శలు చేస్తుంటారు ఓవైసీ. ఆ పార్టీ.. ఈ పార్టీ.. అని తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించడం అసదుద్దీన్ ఓవైసీకే సాధ్యం. ఇక ఇలాంటి విమర్శనాస్త్రాలను పక్కనపెట్టి గత రెండు రోజుల నుంచి ఆయన పాతబస్తీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పలు అభివృద్ధికార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోని రెయిన్ బజార్ వార్డులో రూ.8 కోట్ల 69 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌తో కలిసి ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శంకుస్థాపనలు చేశారు.
రెయిన్ బజార్ ప్రాంతంలో సీసీ రోడ్లు, వాటర్ డ్రైన్, నాలా, బాక్స్ టైప్ నాలా లాంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాసే ఉద్దీన్, యకుత్పురా నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ యసర్ ఆర్ఫాత్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మూడోరోజు మధ్యాహ్నం తర్వాత బహదూర్‌పురా నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను అసదుద్దీన్ ప్రారంభించారు. అసదుద్దీన్ ఎప్పుడూ జనంతో మమేకం అవుతుంటారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తుంటారు. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రతి ఒక్కరిని కలిసి సమస్యలను తెలుసుకుంటారు.
ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారపార్టీ బీఆర్ఎస్ కూడా దూకుడు పెంచింది. పాతబస్తీకి భారీగా నిధులు మంజూరు చేసింది. ఎప్పటి నుంచో మరుగున పడిన పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ విషయాలు పక్కనపెట్టి అభివృద్ధి వెంట పరుగులు పెడుతున్నారు. పేరుకుపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే పనిలో పడ్డారు. కాగా, అసదుద్దీన్‌ది కేవలం ఎన్నికల స్టంటేనంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి