నవంబర్ 11 (ఆంధ్రపత్రిక): అల్లు అర్జున్ నటిస్తున్న ’పుష్ప 2’ ఇండియన్ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నక్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని బన్నీ అభిమానులతో పాటు ’పుష్ప’ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పార్ట్ ’పుష్ప ది రైజ్’ వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించడమే కాకుండా పాన్ ఇండియా మూవీగా రికార్డుల్ని సొంతం చేసుకుంది. దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ’పుష్ప ది రైజ్’తో దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఏ స్థాయి సంచలనాలు సృష్టించాడో అందరికి తెలిసిందే. తొలిసారి తన పంథాకు పూర్తి భిన్నంగా పుష్పరాజ్ పాత్రలో ఊరమాస్ క్యారెక్టర్లో మాసిన బట్టల్లో కనిపించిన తీరు బన్నీ బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. దీంతో ఫస్ట్ పార్ట్ సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకున్న దర్శకుడు సుకుమార్ మైత్రీ మూవీ మేకర్స్ వారు పార్ట్`2ని మరిన్ని ప్రత్యేకతలతో అంతకు మించి అనే స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బన్నీపై టెస్ట్ లుక్ ని పూర్తి చేసిన మేకర్స్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టారంటూ వార్తలు వినిపించాయి. బన్నీ లేకుండానే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లలో పలు కీలక ఘట్టాలని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కానీ హీరో బన్నీ డైరెక్టర్ సుకుమార్ నుంచి కానీ ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో అ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ మొదలైతే మేకర్స్ ఎందుకు అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం లేదు.. ఇంతకీ ’పుష్ప 2’ మొదలైనట్టా .. లేనట్టా..?.. ఎందుకీ దాగుడు మూతలు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇదిలా వుంటే హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి తన ఫ్రెండ్ వివాహంలో హాజరు కావడానికి దక్షిణాఫ్రికా వెళ్లాడు. తిరిగి హైదరాబాద్ చేరుకున్నాక ’పుష్ప 2’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడట. ఆ తరువాత టీమ్ థాయ్‌లాండ్‌లో 15 రోజలు పాటు కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేసిందని ఈ షెడ్యూల్లోనే బన్నీపై పులి ఫైట్‌ని చిత్రీకరించాలనే ప్లాన్ లో వుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!