నవంబర్ 12 (ఆంధ్రపత్రిక): బంగార్రాజు, థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా అంటూ ఈ ఏడాది మూడు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ చైతన్య.. ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. శుక్రవారం నుంచి భారీ యాక్షన్ షెడ్యూల్ను మొదలుపెట్టారు. హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు హైదరాబాద్లో భారీ సెట్ వేశారు. మహేష్ మాథ్యూ ఆథ్వర్యంలో కొన్ని సీన్స్ తీస్తున్నారు. ఇందులో నాగ చైతన్య ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. అరవింద్ స్వామి విలన్గా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా చైతూకి ఇరవై రెండోది. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. శరత్ కుమార్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుడటం విశేషం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!