డీసీసీబీ చైర్మన్ వేచలపు.
వేపాడ,మార్చి,30(ఆంధ్ర పత్రిక):- ప్రాచీన కళలను కళాకారులను ఆదరించడం ద్వారా సాంప్రదాయాలకు ఊపిరి పోయాలని డీసీసీబీ చైర్మన్ వేచలపు వెంకట చిన రామునాయుడు అన్నారు.మండలంలోని నీలకంఠరాజపురం గ్రామంలో శ్రీసీతారాముల కళ్యాణమహోత్సవాన్ని పురష్కరించుకొని గురువారం అనకాపల్లి జిల్లా కే. కోటపాడు మండలం దీక్షితుల అగ్రహారం గ్రామానికి చెందిన మహిళాకోలాటం బృందానికి రెండేసి చీరలను,పురుషులకు సాంప్రదాయ వస్త్రాలను ఆయన అందజేశారు.ఈ సందర్బంగా చినరామునాయుడు మాట్లాడుతూ,డీ.జే శబ్దాలతో అసభ్యకర నృత్యాలతో యువత భవితను నిర్వీర్యం చేస్తున్న నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మార్పు కోరుకొనేందుకు ప్రాచీన కళలను కళాకారులను బ్రతికించుకోవాలన్నారు. పాచ్యాత్తధోరణులతో ప్రాచీన కళలు అంతరించిపోకుండా పునర్జీవం పోయాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు.ప్రాచీన కళలకు ఆదరణ కొరవడడం వల్ల కళాకారులకు ఉపాధి లేక కళారంగం ఒదిలి ఇతర ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చినగుడిపాల సర్పంచ్ భోజంకి రామునాయుడు,మాజీ ఎంపీటీసీ వేచలపు జగ్గిబాబు,మహిళా కోలాట బృందం గురువు కొల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!