న్యూఢల్లీి,అర్టోబరు 13 అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక):ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ఆర్టెమిస్-1’ ప్రయోగానికి ముచ్చటగా మూడోసారి షెడ్యూల్ ఖరారైంది. అమెరికా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మూడో ప్రయత్నంగా నవంబరు 14న ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది. ఇటీవల ఫ్లోరిడాలో హరికేన్ సంభవించడంతో ఈ రాకెట్‌ను లాంఛ్‌ప్యాడ్ నుంచి హాంగర్‌కు తరలించారు. అక్కడ ఇంజినీర్లు తనిఖీలు పూర్తయిన అనంతరం ఈ కొత్త తేదీని ఖరారు చేసినట్లు నాసా ఓ బ్లాగ్‌లో వెల్లడిరచింది. ‘’గతవారం జరిపిన పరిశీలనలు, తనిఖీల అనంతరం రాకెట్, వ్యోమన్యౌకను లాంఛ్ప్యాడ్కు తరలించేందుకు ఇంకొంత పనే మిగిలి ఉందని ఇంజినీర్లు ధ్రువీకరించారు’’ అని నాసా తెలిపింది. నవంబరు 14 నాటికి రాకెట్‌ను తిరిగి లాంఛ్ ప్యాడ్ వద్దకు తీసుకురానున్నారు. నవంబరు 14న 69 నిమిషాల లాంఛ్ విండోలో నాసా ఈ ప్రయోగం చేపట్టనుంది. ఒకవేళ ఆ రోజున కుదరని పక్షంలో బ్యాకప్ తేదీని కూడా సిద్ధం చేసుకున్నారు. నవంబరు 16 లేదా 19న మరో లాంఛ్ విండోలో ప్రయోగం చేపట్టేందుకు అవకాశాలున్నాయని నాసా తెలిపింది. చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టులో భాగమే ఆర్టెమిస్-1. నాసా చేపడుతోన్న ఈ యాత్రలో శక్తిమంతమైన రాకెట్తోసహా వ్యోమనౌకలను నింగిలోకి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు 29న ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. చివరి గంటలో ఇంధన లీకేజీలో సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత సెప్టెంబరు 3న మరోసారి షెడ్యూల్ చేయగా.. అప్పుడు కూడా ఇంధన లీకేజీ సమస్య వచ్చింది. దీంతో వాహకనౌకకు ఇంజనీర్లు మరమ్మతులు చేస్తున్నారు. తొలుత లాంఛ్ప్యాడ్పైనే ఉంచి మరమ్మతులు చేయగా.. ఇటీవల హరికేన్ కారణంగా హ్యాంగర్ వద్దకు తీసుకొచ్చారు. చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. అయితే, ప్రస్తుతం మాత్రం అందులో ఉన్న ఓరియన్ క్యాప్సూల్ మానవరహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రానుంది. 2024లో ఆర్టెమిస్-2, 2025లో ఆర్టెమిస్-3 ప్రయోగాలను నాసా చేపట్టనుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!