సెంటినరి ఉత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రవిరాజ్
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రపత్రిక) :
ఈనెల 27, 28, 29 తేదీలలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ సెంటినరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు, ఆంధ్ర మెడికల్ కళాశాల సెంటినరీ ఉత్సవాల కమిటీ చైర్మెన్ డాక్టర్ టి.రవిరాజ్ తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ 1923 జూలై 19న ప్రాంరంబమైందని, 2023 నాటికి వందేళ్లు పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా ఏ ఎమ్ సి అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంటినరీ ఉత్సవాలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. దేశంలోనే అతి పురాతనమైన వైద్య కళాశాలలో ఒకటైన ఆంధ్ర మెడికల్ కాలేజ్, వందేళ్ళ ఉత్సవాలలో భాగంగా మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో దేశ ఉప రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర మంత్రులు పాల్గోంటారని తెలిపారు. 1923 సంవత్సరంలో 32 మంది వైద్య విద్యార్థులతో మొదలైన ఆంధ్ర వైద్య కళాశాల, అంచెలంచెలుగా ఎదిగి 1950వ సవత్సరం నాటికే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించ గలిగే స్థాయికి ఎదిగిందన్నారు. దేశంలోనే అతి పురాతనమైన వైద్య కళాశాలల్లో ఏడవదని తెలిపారు. ఈ కళాశాలలో చదువుకున్న వారు దేశ విదేశాల్లో స్థిరపడి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కళాశాల వందేళ్లు ఉత్సవాలలో భారత ఉప రాష్ట్రపతి ఈనెల 27వ తేదీన పాల్గొంటారని, అదే విధంగా రెండవ రోజు 28వ తేదీన రాష్ట్ర గవర్నర్ తోపాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటారని వెల్లడించారు. మూడవ రోజు29వ తేదీన తెలుగు సాహితీ వైభవం కార్యక్రమంతో పాటు, రాత్రి మ్యూజికల్ నైట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రారంభ కార్యక్రమం ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఉంటుందని, మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు
ఆంధ్ర మెడికల్ కాలేజ్ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలని భావించిన అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ సహాయం పై ఆధార పడకుండా ఒక సెంటినరీ భవనం నిర్మించారని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రక్కన 1.6 ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు. ఈ భవనం నిర్మాణం కోసం పూర్వ విద్యార్థుల నుండి సేకరించిన విరాళాలతో దాదాపు 50 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం పూర్తి చేసామన్నారు. దీనిని ఉప రాష్ట్రపతి చేతులు మీదుగా ప్రారంభిస్తారని పేర్కోన్నారు. అంతే కాకుండా ఒక పైలాన్ కూడా ఏర్పాటు చేసి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పుడు సెంటినరీ ఉత్సావాలు జరుపుకుంటున్న కాలేజీలు చాలా తక్కువని , అందులో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒకటని తెలిపారు. అనేక మంది ప్రముఖ వైద్యులు దేశంలో అనేక ప్రధాన నగరాలతోపటు ప్రపంచ మంతా వ్యాఫ్తి చెందారని చెప్పారు. దేశ విదేశాల నుంచి 3000 మంది పూర్వ విద్యార్థులు ఈ ఉత్సవాలకు హాజరౌతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజు, కెజిహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ పి. అశోక్ , ఎ ఎమ్ సి పూర్వ విద్యార్థులు, ప్రోఫెసర్లు తదితరులు పాల్గోన్నారు.